Balineni vs Ys Jagan: ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకదానివెంట మరొకటిగా జాబితాలు విడుదలవుతున్నాయి. బాలినేని శ్రీనివాస్ అసంతృప్తిగా ఉండటంతో ప్రకాశం జిల్లా జాబితా విషయంలో కాస్త ఇబ్బంది ఎదురైంది. చివరికి సీఎంతో భేటీ తరువాత బాలినేని అలక మానినట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైనాట్ 175 లక్ష్యంతో దూసుకుపోతున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే మూడు జాబితాలు విడుదల చేశారు. త్వరలో రాష్ట్రంలోని ప్రధాన లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఇన్‌ఛార్జ్‌ల జాబితా విడుదల కావచ్చని తెలుస్తోంది. వైఎస్ జగన్ వర్సెస్ బాలినేని వాసు మధ్య ముందు నుంచి మాగుంట ఎంపీ స్థానం గురించే నడుస్తోంది. మాగుంటకు ఒంగోలు ఎంపీ స్థానం కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంపైనే బాలినేని అలకతో ఉన్నారు. ఈ విషయమై తాజాగా నిన్న మరోసారి బాలినేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు జగన్. ఒంగోలు లేదా గిద్దలూరులో ఏదనేది నిర్ణయం తీసుకునే బాధ్యతను బాలినేనికే వదిలేశారు. 


ఇక మాగుంట శ్రీనివాస్ విషయంలో మాత్రం ఎలాంటి ప్రస్తావన తీసుకురావద్దని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఇంతకాలం మాగుంట విషయంలో పట్టుబట్టిన బాలినేని వాసు ఆ విషయాన్ని వదిలేశారు. ఒంగోలులో ఇళ్ల పట్టాల విషయంపై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్‌తో హామీ పొందారు. బాలినేని విషయంలో క్లారిటీ రావడంతో ఇక ఎంపీ స్థానాలైన ఒంగోలు, నర్శరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాల్ని ఫైనల్ చేయవచ్చు. 


Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కన్నీళ్లు తెప్పించిన లేఖ.. అభిమాని అక్షరాలకు చలించిన పవర్ స్టార్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook