AP Zilla Parishad Elections: జిల్లా పరిషత్ ఎన్నికల్లో దూసుకుపోతున్న వైసీపీ
AP Zilla Parishad Elections: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా రెండంకెలకే పరిమితమైంది.
AP Zilla Parishad Elections: ఏపీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసీపీ..జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. ప్రతిపక్ష టీడీపీ ఇంకా రెండంకెలకే పరిమితమైంది.
ఏపీలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ప్రారంభమైంది. అందరూ ఊహించినవిధంగానే అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ( Ysr Congress Party) దూసుకుపోతోంది. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండంకెల స్థానాన్ని దాటలేకపోతోంది. జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్(Zptc Mptc Election Results)ప్రారంభం నుంచీ వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. ఉదయం 10 గంటలవరకూ అందిన ఫలితాల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాల్లో మూడంకెలు దాటేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకూ అందిన ఫలితాల ప్రకారం జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ ఇంకా బోణీ చేయలేదు. కృష్ణా జిల్లాలో ఇంకా టీడీపీ బోణీ ప్రారంభం కాలేదు. అటు గుంటూరులో సైతం తెలుగుదేశం పార్టీ ప్రభావం నామమాత్రంగా ఉంది. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 213 ఎంపీటీసీ స్థానాల్ని దక్కించుకోగా..తెలుగుదేశం పార్టీ 4 సీట్లు మాత్రమే సాధించింది.
అటు ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam) 33 ఎంపీటీసీ స్థానాల్ని సాధించగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 316 స్థానాల్ని దక్కించుకుంది. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 180 సీట్లు రాగా, టీడీపీకు 4 సీట్ల దక్కాయి. చంద్రబాబునాయుడు(Chandrababu)సొంత జిల్లా చిత్తూరులో కూడా పరిస్థితి సరిగ్గా లేదు. ఆ జిల్లాలో టీడీపీకు కేవలం 19 స్థానాలు దక్కగా..వైసీపీకు 382 సీట్లు వచ్చాయి. కడప జిల్లాలో వైసీపీ ఇప్పటివరకూ 440 ఎంపీటీసీ స్థానాల్ని దక్కించుకోగా, టీడీపీ 38 స్థానాల్ని సాధించింది. ఇక అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఉనికి దాదాపు కోల్పోతోంది. వైసీపీ ఇప్పటివరకూ 51 స్థానాల్ని సాధించగా, టీడీపీ కేవలం 1 ఎంపీటీసీ స్థానాన్ని గెల్చుకుంది. కర్నూలులో టీడీపీ పరిస్థితి కాస్త ఫరవాలేదు. ఈ జిల్లాలో టీడీపీ 44 ఎంపీటీసీ స్థానాల్ని గెల్చుకోగా, వైసీపీ 277 స్థానాల్ని సాధించింది. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు. అటు విజయనగరం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఇప్పటి వరకూ 1 ఎంపీటీసీ స్థానాన్ని గెల్చుకోగా. వైసీపీ 77 సీట్లను గెల్చుకుంది. మరో ప్రతిపక్షం జనసేన విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఇప్పటివరకూ ఏడు ఎంపీటీసీ స్థానాల్ని గెల్చుకుంది.
Also read: H1B Visa: హెచ్ 1 బి వీసాల జారీలో అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి