విజయవాడ ( Vijayawada) నగరం ఇకపై సోలార్ పవర్ సిటీ ( Solar power city ) గా మారనుంది. సోలార్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడను ఎంపిక చేసింది. 40 శాతం సబ్సిడీతో ఇక విజయవాడ బిల్డింగులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కానున్నాయి. ఈ పధకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర నగరాలకు సైతం విస్తరించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లో వాణిజ్యనగరమైన విజయవాడను కేంద్రం సోలార్ విద్యుత్  సిటీగా ఎంపిక చేసింది. సోలార్ విద్యుత్ ప్రాజెక్టులో ( Solar power project )  భాగంగా ఎంపిక కావడంతో 40 శాతం సబ్సిడీతో నగరంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సోలార్ పవర్ ను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. ఈ పధకం కింద నగర పరిధిలోని అన్ని కమర్షియల్ బిల్డింగులపై సోలార్ ప్యానెల్స్ ( Solar panels) ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటుకు 40 వేల వరకూ ఖర్చవుతుంది. నగరంలో ఎక్కువగా 2-3 కిలోవాట్ల విద్యుత్ వినియోగమయ్యే కనెక్షన్లే ఉన్నాయి. ఈ నేపధ్యంలో 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ వెచ్చించగలిగితే ప్రతి ఇంటికీ విద్యుత్ అందుతుంది. 40 శాతం సబ్సిడీ ( 40 percent subsidy)  కేంద్రం అందిస్తుండటంతో ప్రతి కిలోవాట్ కు 16 వేల వరకూ రాయితీ లభిస్తుంది. ప్రస్తుతానికి సబ్సిడీ కేవలం డొమెస్టిక్ వినియోగదారులకే వర్తించనుంది. వాణిజ్య అవసరాలకు ఏ మేరకు రాయితీ అందించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పధకం రాష్ట్రంలోని అన్ని పట్టణాలకూ అమలైతే విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )  స్వయం సమృద్ధి సాధించడానికి ఆస్కారం  కలుగుతుంది. Also read: TTD: తిరుమల దేవస్థానం సిబ్బందికి కరోనా: దర్శనాలకు బ్రేక్ ?


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..