విజయవాడ: ట్రాన్స్‌మిష‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లిమిటెడ్‌(ఏపీట్రాన్స్‌కో) చార్టెట్ అకౌంటెంట్ (Chartered Accountant) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న పోస్టులను రిక్రూట్ చేస్తున్నారు. విజ‌య‌వాడ‌లోని ఏపీట్రాన్స్‌కో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం పోస్టులు 129 ఉండగా ప్రస్తుతం 04 సీఏ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. అకౌంటింగ్ పోస్టులు 21, నాన్ అకౌంటింగ్ పోస్టులు 108ఉన్నాయి. వీటికి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

152 మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. దరఖాస్తు పూర్తి వివరాలు మీకోసం


పోస్టులు: చార్టెడ్ అకౌంటెంట్
మొత్తం ఖాళీలు: 04
క్వాలిఫికేషన్: సీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఎస్ఏపీ (SAP) అప్లికేష‌న్‌లో అనుభ‌వం ఉండాలి.
అర్హత: ఆడిటింగ్‌లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం. బ్యాంక్ ఆడిటింగ్‌ను పరిగణించరు.
వయసు: 55ఏళ్లకు మించరాదు
దరఖాస్తుల స్వీకరణకు గడువు: 26-02-2020 సాయంత్రం 5గంటల వరకు.


మరిన్ని ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి


ఆఫ్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగానికి మీకు ఉన్న అర్హతలు, పనిచేసిన అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్స్, తాజా పాస్ పోర్ట్ ఫొటోను కింది అడ్రస్‌కు పోస్ట్ చేయాలి. 


చిరునామా: 
Financial Advisor & Chief Controller of Accounts (Accounts), 
APTRANSCO, 1st floor, Vidyut Soudha, Gunadala, Eluru Road, Vijayawada-520004 


నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి


వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి