Huge Police Force at Ayyanna Patrudu House: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.అర్ధరాత్రి సమయంలో మున్సిపల్ సిబ్బంది ఆయన ఇంటి ప్రహరీ గోడను కూల్చివేశారు. నిబంధనలకు విరుద్దంగా పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారనే కారణంతో దాన్ని జేసీబీలతో కూల్చేశారు. ఈ క్రమంలో అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులను అడ్డగించడంతో కూల్చివేత పనులు కొద్దిసేపు నిలిచిపోయాయి.దీంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. ప్రస్తుతం కూల్చివేత పనులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల మేర అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై మున్సిపల్ సిబ్బంది నోటీసులు అందజేశారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో అర్ధరాత్రి జేసీబీలతో గోడను కూల్చివేశారు. కూల్చివేతను అడ్డుకునేందుకు యత్నించిన అయ్యన్న కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి బయటకు తరలించారు. అయ్యన్న ఇంటి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అటువైపు వెళ్లే రెండు మార్గాలను మూసివేశారు. స్థానిక ఏఎస్పీ పర్యవేక్షణలో ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 


గోడ కూల్చివేతపై అయ్యన్న కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2వ తేదీతో ఉన్న నోటీసులను తీసుకొచ్చి ఇచ్చారని.. ముందస్తు సమాచారం లేకుండానే గోడను తొలగిస్తున్నారని మండిపడుతున్నారు. గోడ తొలగింపు విషయం తెలిస్తే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ప్రస్తుతం అక్కడికి మీడియాను కూడా అనుమతించట్లేదని తెలుస్తోంది. 
 



Also Read: Horoscope Today June 19th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది...  


Also Read: Sai Pallavi Explanation: మతం గురించి మాట్లాడలేదు.. భజరంగ్ దళ్ హెచ్చరికలకు సాయి పల్లవి సమాధానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook