Horoscope Today June 19th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది...

Horoscope Today June 19th 2022: కర్కాటక రాశి మరియు ధనుస్సు రాశి వారు ఈరోజు వ్యాపారంలో పురోగతి సాధించగలరు. మరోవైపు, తుల రాశి వారు ఈరోజు తమ కెరీర్‌లో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 07:12 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కర్కాటక, ధనస్సు తదితర రాశుల వారికి మంచి ఫలితాలు
  • తుల రాశి వారికి కెరీర్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చు
  • ఇవాళ్టి రాశి ఫలాలను బనారస్ జ్యోతిష్యుడు సచ్చిదానంద్ త్రిపాఠి అందిస్తున్నారు
Horoscope Today June 19th : నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది...

Horoscope Today June 19th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య భగవానుడి రోజు. ఆదివారం సూర్య భగవానుడిని పూజించడం అన్నివిధాలా శుభప్రదం. సూర్య భగవానుడు తన భక్తులను శత్రువుల నుండి రక్షిస్తాడని నమ్ముతారు. అందుకే ఈరోజు ఉపవాస దీక్ష ఉండి సూర్యుడిని పూజిస్తారు. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి నీటిలో ఎర్ర చందనం వేసి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇవాళ్టి (రోజువారీ రాశిఫలం 19 జూన్ 2022) రాశి ఫలాలను బనారస్‌కు చెందిన జ్యోతిష్యుడు సచ్చిదానంద్ త్రిపాఠి అందిస్తున్నారు.

మేషరాశి (Aries)

మేష రాశి వారి జాతకంలో ఇవాళ సూర్యుడు రెండవ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు పదకొండవ ఇంట్లో ఉన్నాడు. అంగారకుడి సంచారం కారణంగా ఇంటికి సంబంధించిన పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ రోజు మీకు చాలా శుభప్రదం. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈ రోజు మీ అదృష్ట రంగులు పసుపు, ఎరుపు.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి వారి జాతకంలో బృహస్పతి 11వ, చంద్రుడు 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ కారణంగా వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నారింజ, ఆకుపచ్చ రంగులు ఈరోజు మీకు శుభప్రదం. ఉత్తమ ఫలితాల కోసం ఈరోజు బెల్లం దానం చేయండి.

మిథున రాశి (GEMINI)

రాజకీయ జీవితంలో పురోగతి ఉంటుంది. శని, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఈరోజు మీకు శుభప్రదమైన రంగులు నారింజ, స్కై బ్లూ. ఇవాళ మీకు ఆర్థికంగా కలిసొస్తుంది.

కర్కాటక రాశి (Cancer) 

బృహస్పతి కారణంగా ఇవాళ మీకు అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారంలో లాభాలను పొందుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు తెలుపు, పసుపు శుభప్రదమైన రంగులు.

సింహ రాశి (LEO)

ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. కొత్త కారును కొనుగోలు చేసే అవకాశం. గృహ సంబంధిత పెట్టుబడులు పెడుతారు. ఇంటికి చుట్టాల రాకతో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. నారింజ, తెలుపు మీకు శుభప్రదమైన రంగులు.

కన్య రాశి (Virgo)

మీరు బ్యాంకింగ్, మీడియా రంగానికి చెందిన వారైతే ఇవాళ మీకు ఉద్యోగ ప్రమోషన్ ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఈ రోజు శని అనుగ్రహం మీపై ఉంటుంది. తద్వారా అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు మీకు శుభప్రదమైన రంగులు ఊదా, స్కై బ్లూ. వీటిని ధరించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే, ఆవుకు బెల్లం తినిపిస్తే పుణ్యం లభిస్తుంది.

తులా రాశి (Libra)

ఈరోజు మీ కెరీర్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులకు చంద్రుడు, బృహస్పతి సంచారం శుభప్రదం. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు శుభప్రదమైన రంగులు ఊదా, తెలుపు.

వృశ్చిక రాశి (Scorpio)

చంద్రుడు నాలుగవ ఇంట్లో సంచరించడం వల్ల మీకు అన్నివిధాలా కలిసొస్తుంది. బ్యాంకింగ్ పనులలో ప్రమోషన్ పొందుతారు. ఇవాళ మీకు శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, తెలుపు. వీలైతే పేద ప్రజలకు ఉసిరి పప్పును దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఈ రోజు చంద్రుడు మూడవ ఇంట్లో, బృహస్పతి నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నారు. ఈ ప్రభావం కారణంగా వ్యాపారంలో విజయాన్ని పొందవచ్చు. చాలా కాలం తర్వాత మీ ప్రియ మిత్రుడిని కలుసుకుంటారు. ఈరోజు మీకు శుభప్రదమైన రంగులు తెలుపు, ఊదా.

మకర రాశి (Capricorn) 

మీ జాతకంలో చంద్రుడు రెండవ, ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు. తద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. వృత్తిలో ప్రమోషన్ పొందుతారు. తల్లి ఆశీస్సుల్లో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మంచి ఫలితాలను పొందడానికి, ఈరోజు శ్రీ సూక్తాన్ని పఠించండి. ఈ రోజు మీకు శుభదప్రదమైన రంగులు ఆకుపచ్చ, నారింజ.

కుంభ రాశి (Aquarius)

ఈ రోజు మీరు చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఒకరిని కలుసుకుంటారు. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ రోజు మీ అదృష్ట రంగులు ఆకుపచ్చ, ఊదా.

మీన రాశి (Pisces) 

ఈ రాశిలో బృహస్పతి, శని 12వ ఇంట్లో సంచరిస్తున్న కారణంగా.. ఉద్యోగ ప్రమోషన్‌కు అవకాశం ఉంది. మీరు వ్యాపార రంగానికి చెందిన వారైతే మంచి లాభాలను చవిచూస్తారు. ఈరోజు మీ శుభప్రదమైన రంగులు నారింజ, పసుపు. ఇవాళ మంచి ఫలితాలను పొందడానికి మీరు పేద ప్రజలకు ఉసిరి దానం చేయాలి.

Also Read: Ayyanna Patrudu: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద భారీగా పోలీసులు.. కారణమిదే..!

Also Read: Sai Pallavi Explanation: మతం గురించి మాట్లాడలేదు.. భజరంగ్ దళ్ హెచ్చరికలకు సాయి పల్లవి సమాధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News