Ayyanna Patrudu: ఏపీలో పది ఫలితాలపై రాజకీయ రగడ..కొడాలి నానికి అయ్యన్నపాత్రుడు కౌంటర్..!

Ayyanna Patrudu on Kodali nani: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటిక్స్‌ హాట్‌ హాట్‌గా ఉన్నాయి. పదో తరగతి ఫలితాల చుట్టే వార్‌ సాగుతోంది. టీడీపీ నేత నారా లోకేష్‌ మీటింగ్‌లో గందరగోళం నెలకొంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 9, 2022, 07:01 PM IST
  • పదో తరగతి ఫలితాలపై రాజకీయ రగడ
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • కొడాలి నానికి అయ్యన్నపాత్రుడు కౌంటర్
Ayyanna Patrudu: ఏపీలో పది ఫలితాలపై రాజకీయ రగడ..కొడాలి నానికి అయ్యన్నపాత్రుడు కౌంటర్..!

Ayyanna Patrudu on Kodali nani: ఏపీలో పదో తరగతి ఫలితాలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కరోనా పరిస్థితుల వల్లే ఉత్తీర్ణత తగ్గిందని అధికార పార్టీ చెబుతుంటే..ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా పదో తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.

సమావేశంలో ఒక్కసారిగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రావడం హాట్ టాపిక్‌గా మారింది. వెంటనే దీనిపై స్పందించిన నారా లోకేష్ తనదైన శైలి పంచ్‌లు పేల్చారు. సమావేశంలో వైసీపీ నేతలు ఉంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. ఈ వెంటనే వారు సైన్ ఔట్ అయ్యారు. దీనిపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

ఈనేపథ్యంలో మాజీ మంత్రి కొడాలినానిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఎనిమిదవ తరగతి ఫైయిల్ అయిన ఆయన 10వ తరగతి జూమ్‌కి రావడం విడ్డూరమన్నారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని..అందుకే జూమ్‌లోకి వచ్చారని విమర్శించారు. విద్యా వ్యవస్థను సీఎం జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకత ఉండటంతోనే పరదాలు కట్టుకుని వెళ్తున్నారన్నారు.

Also read:Pooja Hegde Tweet: సినీ నటి పూజా హెగ్డేకు తప్పని చేదు అనుభవం..అసలేమి జరిగిందంటే..!

Also read:IND vs SA1st T20I: భారత్‌దే బ్యాటింగ్.. యువ పేసర్లకు నిరాశే! టీమిండియా కెప్టెన్‌గా రిషబ్ పంత్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News