AP Real Estate: ఇన్నాళ్లు కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూటమి ప్రభుత్వం ఊతమిచ్చింది. రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బలాన్ని చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భ‌వ‌నాలు, లేఅవుట్ల అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేస్తూ ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం వెలువరించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్క‌ర‌ణ‌ల‌పై వేసిన క‌మిటీ నివేదికకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఆ నివేదిక అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో భూముల ధరలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కూటమి ప్రభుత్వం ఆశిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 'కిస్సిక్' పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌?


మున్సిప‌ల్ శాఖ‌పై సోమవారం సచివాలయంలో సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌ చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సంస్క‌ర‌ణ‌ల‌పై వేసిన క‌మిటీ నివేదికపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించిన అనంతరం ఆమోదం తెలిపారు. అనంతరం మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. 15 మీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ భ‌వ‌నాల నిర్మాణాల ప్లాన్‌ల‌కు మున్సిప‌ల్ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేదని ప్రకటించారు. లైసెన్సెడ్డ్ సర్వేయర్లు సంబంధిత ప్లాన్ ఆన్‌లైన్‌లో పెట్టి న‌గ‌దు చెల్లిస్తే అనుమ‌తి వ‌చ్చేస్తుందని వివరించారు. పునాది వేసిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే స‌రిపోతుందని పేర్కొన్నారు.


 


ఇది చదవండి: YS Sharmila: గౌతమ్ అదానీతో జగనన్న 'లంచం' ఒప్పందాన్ని రద్దు చేయండి


 


దరఖాస్తును అంతా స‌క్ర‌మంగా ఉందో లేదో ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తుందని మంత్రి నారాయణ వివరించారు. ఏమైనా అక్రమాలు జరిగితే స‌ర్వేయ‌ర్ల లైసెన్స్ రద్దు.. క్రిమినల్ కేసులు న‌మోదు ఉంటాయని తెలిపారు. ఈ నిర్ణయం వలన 95 శాతం మంది మున్సిప‌ల్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవ‌స‌రం ఉండ‌దని వెల్లడించారు. భవ‌నాల అనుమ‌తుల‌కు డిసెంబర్ 31వ తేదీ నుంచి సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.


'టీడీఆర్  బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునేలా అనుమతి ఉంది' అంటూ సమీక్షలో సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి నారాయణ తెలిపారు. 500 చదరపు అడుగులు దాటిన నివాస భవనాలకు సెల్లార్ పార్కింగ్‌కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. లే ఆవుట్లలో ఇక నుంచి 9 మీటర్ల రోడ్డును మాత్రమే వదిలేలా వెసులుబాటు ఇచ్చినట్లు చెప్పారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.