AP Covid Strain: దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరిగే కొద్దీ వివిధ రకాల వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అతి భయంకరమైన ఎన్ 440 కే వైరస్ ఉందంటూ వచ్చిన వార్తలు మరింతగా భయపెట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో ఎన్ 440 కే వైరస్ ఉందంటూ వచ్చిన వార్తలపై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాయి. ఏపీలో కొత్త రకం వైరస్ అనేది లేదని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్ స్పష్టం చేశారు. ఎన్ 440 కే వైరస్ ( N440K Virus Strain) ప్రభావం అసలు దేశంలోనే ఎక్కడా కన్పించలేదన్నారు. దేశంలో బీ 167 వైరస్ ప్రభావం మాత్రమే ఉందని తెలిపారు. అటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇదే విషయంపై స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ తరహా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ జరగలేదని స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. 


ప్రతి నెలా సీసీఎంబీ (CCMB) కు ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్నించి జన్యుశ్రేణి పరీక్షల కోసం నమూనాలు వస్తుంటాయని..ఇందులో ఎన్ 440 కే వైరస్ దక్షిణ భారతదేశం నుంచి వచ్చినట్టుగా గత యేడాది జూన్, జూలై నెలల్లో గురించారు. అయితే ఇప్పుడు దాని ప్రబావం పూర్తిగా అంతర్దానమైందని జవహర్ రెడ్డి చెప్పారు. దేశంలో ప్రస్తుతం బీ 167 స్ట్రెయిన్ ప్రభావమే ఎక్కువగా ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపిడేమియాలజికల్‌లో కూడా బీ 167 (B 167 Virus strain) గురించే ప్రస్తావన ఉంది గానీ...ఎన్ 440 కే వైరస్ గురించి లేదని చెప్పారు. అబద్ధాలు ప్రసారం చేయవద్దని...బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. 


Also read: AP Curfew: మద్యాహ్నం 12 గంటలు దాటితే..ఏపీలో నో ఎంట్రీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook