NO Entry: కరోనా మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ఇక ఏపీలో నో ఎంట్రీ అంటున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసు పహారా అధికమైంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం (Ap government) రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తోంది. మొన్నటివరకూ నైట్‌కర్ఫ్యూ(Night Curfew) మాత్రమే అమలు చేసిన ప్రభుత్వం నిన్నటి నుంచి అంటే మే 5వ తేదీ నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు చేస్తోంది. ప్రతి రోజూ కేవలం 6 గంటల్నించి 12 గంటల వరకూ అంటే కేవలం 6 గంటలే రాకపోకలు, వ్యాపార, నిత్యావసరాలకు అనుమతిచ్చింది. అంటే ఏపీ(AP)లో ఏ పనిపై వెళ్లాలన్నా కేవలం ఆరు గంటలే సమయం ఉంటుంది. ఇందులో భాగంగా కర్ప్యూని పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసులు పహారా తీవ్రం చేశారు.
ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో(Ap-Telangana Borders)పోలీసుల్ని మొహరించారు. ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకే రాష్ట్రంలో అనుమతిస్తున్నారు. మద్యాహ్నం 12 తరువాత వచ్చే వాహనాల్ని వెనక్కి పంపించేస్తున్నారు. అత్యవసర సేవలు, గూడ్స్, వాహనాల రాకపోకలకు మినహాయింపు ఇచ్చారు. మద్యాహ్నం 12 గంటలకే స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేస్తున్నారు. వ్యాపారులు కూడా కర్ఫ్యూకు పూర్తిగా సహకరిస్తున్నారు. అంతర్ జిల్లా చెక్ పోస్టులు, జిల్లా చెక్ పోస్టుల్ని పటిష్టం చేశారు. మే 18వ తదీ వరకూ కర్ఫ్యూకు (Ap Curfew) ప్రజలు సహకారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మద్యాహ్నం 12 గంటలు దాటితే వాహనాల్ని రాష్ట్రంలో అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు.
Also read: Covid Care in Ap: అత్యధికంగా కరోనా పరీక్షలు, ఉచితంగా వైద్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook