Clean Godavari Project: అఖండ గోదావరి ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. ఇక గంగా నది తరహాలోనే గోదావరి కాలుష్యం నివారణ కానుంది. క్లీన్ గోదావరిగా మార్చేందుకు నిధులు విడుదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవనది గోదావరి ఇకపై క్లీన్ గోదావరిగా మారేందుకు మరెంతో దూరం లేదు. అడుగడుగునా కాలుష్యమయమై..ప్రాణంతకంగా మారుతున్న గోదావరి నది ప్రక్షాళనకు చర్యలు ప్రారంభమయ్యాయి. జలజీవన్ మిషన్‌లో భాగంగా నమామి గోదావరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. గంగానది తరహాలో..దశలవారీగా పవిత్ర గోదావరి నదిని ప్రక్షాళించేందుకు చర్యలు చేపట్టనున్నారు. నమామి గోదావరి డీపీఆర్‌కు 4 వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో భాగంగా..తొలిదశలో 88.43 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 


అఖండ గోదావరి కాలుష్యమయమై కన్పించేది రాజమండ్రి నగరంలో. ఇక్కడ మురుగు నీరు నేరుగా నదిలో కలవడాన్ని జాతీయ కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. తొలి విడత నిధుల ద్వారా శుద్ధి చేసిన నీటిని నదిలో కలిసేలా..ప్రణాళికలు సిద్దమయ్యాయి. తొలిదశ ప్రణాళిక ప్రకారం..త్వరలో టెండర్లు ఖరారు కానున్నాయి. నగరంలోని అన్ని డివిజన్ల నుంచి రోజుకు విడుదలయ్యే 60 ఎంఎల్‌డీ మురుగు నీటిని కొత్త ప్లాంట్ ద్వారా శుద్ధీకరించి అప్పుడు గోదావరిలో కలుపుతారు. దీనికోసం ఇప్పుడున్న 30 ఎంఎల్‌డీ ప్లాంట్‌కు అదనంగా 50 ఎంఎల్‌డీతో మరో ప్లాంటు హుకుంపేట వద్ద నిర్మించనున్నారు. ఇక మురుగు నీటిని ఎస్‌టీపీ ప్లాంట్‌లకు పంపింగ్ చేసేందుకు 2.24 కిలోమీటర్ల మేర పంపింగ్ లైన్ ఏర్పాటు కానుంది. 


ఇలా నగరంలోని మురుగునీటిని ప్యూరిఫై చేసిన తరువాత గోదావరిలో కలపడం ద్వారా గోదావరి పక్షాళన తొలి దశ పూర్తవుతుంది. రెండవదశలో వివిధ పరిశ్రమల్నించి వచ్చే వ్యర్ధాల్ని గోదావరిలో కలవకుండా చేయడం. 


Also read: Road cum Runways: ఏపీలో హైవేపై రన్‌వేలు, విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook