Nuclear reactors in AP: ఏపీలో 6 న్యూక్లియర్ రియాక్టర్స్: రాజ్యసభలో కేంద్ర మంత్రి!
Nuclear reactors in AP: శ్రీకాకుళంలో న్యూక్లియర్ రియాక్టర్స్ నెలకొల్పే అంశంపై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఆరు రియాక్టర్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.
Nuclear reactors in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా న్యూక్లియర్ రియాక్టర్స్ నెలకొల్పేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రియాక్టర్లను నెలకొల్పనున్నట్లు తెలిసింది.
ఒక్క రియాక్టర్‌ను 1208 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంతో నెలకొల్పనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి (పర్సనల్, పబ్లిక్ గ్రేవియన్స్ అండ్ పెన్షన్స్) డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్య సభకు గురువారం ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు జితేంద్ర సింగ్.
ఇంకా ఏం చెప్పారంటే..
ఈ రియాక్టర్లు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో నెలకొల్పనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అన్ని రియాక్టర్లు కలిపి 7248 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేశారు. అమెరికా సహాయంతో ఈ రికాక్టర్లను నెలకొల్పనున్నట్లు వివరించారు.
అయితే ఈ రియాక్టర్లను నెలకొల్పే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఇందుకోసం ఎంత ఖర్చు చేయనున్నారు అనే వివరాలపై స్పష్టత రాలేదు.
అయితే కొవ్వాడలో రియాక్టర్లు నెలకొల్పే అంశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఈ విషయంపై చర్చ సాగుతోంది. పదేళ్ల క్రితమే 2 వేల ఎకరాల భూమిని ఎదుకోసం సేకరించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. 450 ఎకరాల సేకరణ పూర్తయింది కూడా. అయితే స్థానిక మత్స్యకారులు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీనితో ఈ ప్రాజెక్టు కాస్త వాయిదా పడుతూ వస్తోంది.
Also read: AP PRC Issue: పీఆర్సీ వివాదం పరిష్కారం దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల చర్చలు!
Also read: Tirumala Updates: ఫిబ్రవరి 15 తర్వాత శ్రీవారి సర్వదర్శనం టోకెన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook