AP PRC Issue: పీఆర్సీ వివాదం పరిష్కారం దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల చర్చలు!

AP PRC Issue: ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సాగుతున్న వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా చర్చల్లో కనిపిస్తున్న పురోగతే ఇందుకు కారణం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 11:47 PM IST
  • ఉద్యోగ సంఘాలు, ఏపీ మంత్రుల కమిటీ చర్చల్లో పురోగతి
  • వివాదం పరిష్కారం దిశగా సాగుతున్న చర్చలు
  • పలు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం!
AP PRC Issue: పీఆర్సీ వివాదం పరిష్కారం దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల చర్చలు!

AP PRC Issue: ఏపీ పీఆర్​సీ వివాదం నేపథ్యంలో.. మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చల్లో కాస్త పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్​ఆర్​ఏ శ్లాబుల్లో సవరణకు మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇతర డిమాండ్లపైనా మంత్రుల కమిటీని ఒప్పంచే దిశగా ఉద్యోగ సంఘాల చర్చలు జరుగుతున్నాయి.

కొత్త శ్లాబుల ప్రతిపాదనలు ఇలా..

జనాభా ప్రాతిపదికన కనీస హెచ్​ఆర్​ఏ 8 శాతం నుంచి గరిష్ఠంగా 24 శాతంగా మంత్రుల కమిటి ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

ఇక దీనితో పాటు.. అదనపు క్వాంటమ్​ పెన్షన్​ అంశంపైనా మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. 

అయితే ప్రస్తుత ఇంకా చర్చలు సాగుతున్న నేపథ్యంలో ఈ విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇరు పక్షాలు ఈ విషయంపై ఏకతాటిపైకి వచ్చిన తర్వాత అధికారిక ప్రకకటన చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం వివాదానికి పూర్తి పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి.

వివిధ ఉద్యోగ సంఘాల తరఫున 20 మంది ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. మంత్రుల కమిటీలో.. మంత్రులు పేర్ని నాని, బోత్స సత్యనారాయణ, బుగ్గన ఉన్నారు. సీఎస్​ సమీర్​ శర్మ, జీఏడీ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్​, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం తరఫు కమిటీలో ఉన్నారు.

Also read: AP Teachers: టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... త్వరలో 30 వేల మందికి ప్రమోషన్లు

Also read: Chalo Vijayawada: ఆ జనసందోహాన్ని చూసి రాంగోపాల్ వర్మకు చలి జ్వరం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News