Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌తో గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఇప్పట్లో విడులయ్యే అవకాశాలు కన్పించడం లేదు. దసరాకు సైతం జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలు అందుకు ఉదాహరణ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ఎట్టకేలకు విచారణ, వాదనలు ముగిశాయి. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు గత కొద్దిరోజులుగా హోరాహోరీ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదించగా, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. క్వాష్ పిటీషన్ విచారణ మొత్తం సెక్షన్ 17ఏ చుట్టూనే సాగింది. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని అతని తరపు న్యాయవాదులు పేర్కొంటే. వర్తించదని సీఐడీ వాదించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ వాదనలు పూర్తయినట్టు ప్రకటించి పిటీషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు తెలిపింది. ఇరుపక్షాలు లిఖిత పూర్వక వాదనలు శుక్రవారం వరకూ అందించవచ్చని కోర్టు తెలిపింది. కోర్టుకు సెలవులు కావడంతో దసరా తరువాతే తీర్పు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. 


మద్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు


క్వాష్‌పై వాదనలు విన్పిస్తూనే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు అభ్యర్ధించారు. 73 రోజులుగా చంద్రబాబు జైళ్లోనే ఉన్నారని, కోర్టు సెలవులుండటంతో మద్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రాలు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ దశలో మద్యంతర బెయిల్ ప్రస్తావన లేదని జిస్టిస్ అనిరుధ్ బోస్ స్పష్టం చేశారు. ప్రధాన కేసు క్వాష్ పిటీషన్‌పై వాదనలు విన్నామని, క్వాష్ చేయాలా వద్దా అనే తీర్పు ఇచ్చేస్తామని తెలిపారు. 


Also read: Supreme Court: క్వాష్‌పై వాదనలు పూర్తి, శుక్రవారం తేలనున్న చంద్రబాబు భవితవ్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook