విజయనగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జనాలను అడుగుతున్నారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి రూలింగ్ ఆట వస్తువు కాదు...రూలింగ్ అనేది డ్రైవింగ్ లాంటిది సత్తా ఉన్నవారికే ఛాన్స్ ఇవ్వాలి... ఇది ప్రయోగం చేసేది కాదని జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జగన్ కు తెలిసింది ఒక్కటే...


ప్రతిపక్ష నేత జగన్ తెలిసింది ఒకే ఒక్కటి..అది అవినీతి మార్గంలో డబ్బులు సంపాదించుకోవడం.. అది తప్పా ఆయనకు పరిపాలన గురించి తెలియదని చంద్రబాబు విరమ్శించారు. సంపాదన కోసమే జగన్ రాజకీయాల్లోకి వచ్చారు..లక్ష కోట్లు దోచుకున్న జగన్ కు ఇంకా ఆశ చావ లేదు..అలాంటి వారికి అవకాశం ఇస్తే రాష్ట్రం అదోగతి పాలవుతుందని చంద్రాబాబు హెచ్చరించారు. టీడీపీ  ప్రభుత్వం లేకపోతే అభివృద్ధి  ఆగిపోతుందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ టీడీపీ రావాలని చంద్రబాబు పేర్కొన్నారు 


జగన్ వస్తే ....పరిశ్రమలు పోతాయి 


 ఎన్నికల ప్రచారంలో జగన్  పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎంత కష్టపడి రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే వాతావరణం సృష్టించానని.. మళ్లీ టీడీపీ వస్తేనే ఆ పరిశ్రమలు ఏర్పడుతాయన్నారు. ఒక వేళ జగన్ వస్తే రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు కూడా తిరిగి వెళ్లిపోతాయన్నారు. తన హయంలో వోగ్స్ వ్యాగన్ భారీ పరిశ్రమను ఎంతో కష్టపడి ఏపీకి తీసుకొస్తే.. బొత్స అవినీతి పుణ్యమని అది కాస్తా పూణెకి తరలివెళ్లిపోయిందని చంద్రబాబు దయ్యబట్టారు.