Anandaiah's ayurvedam mandu: కృష్ణపట్నం: ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీ కోసం దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి (MLA Kakani Govardhan Reddy) విజ్ఞప్తి చేశారు. ఆనందయ్య పంపిణీ చేసే మందు మరే ఇతర కౌంటర్లలో లభించదని, కేవలం అతడి వద్దే లభిస్తుందని చెప్పిన కాకాని గోవర్థన్ రెడ్డి.. ఒకవేళ ఎవరైనా ఆనందయ్య మందుకు (Anandaiah mandu) ఏర్పడిన డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు అడ్డదార్లు తొక్కి మోసాలకు పాల్పడినట్టు తేలితే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనాకు ఆయుర్వేద మందు (Ayurvedic medicine for Coronavirus) తయారీ, పంపిణీ విషయంలో పూర్తి నిర్ణయాధికారాలు ఆనందయ్యవే తప్ప ఈ విషయంలో ప్రభుత్వానికి కానీ లేదా వైసీపీకీ కానీ ఎలాంటి సంబంధం లేదని కాకాని గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆనందయ్య వద్ద కరోనా ఆయుర్వేద ఔషదం తీసుకున్నందురు ప్రతిగా ఏదైనా ఆర్థిక సహాయం అందించాలనుకున్నా వారు గానీ వారు నేరుగా ఆనందయ్యకు అందజేయాలని సూచించారు. ఆనందయ్య పేరు చెప్పుకుని మధ్యలో వసూళ్లకు పాల్పడే వారికి డబ్బులు ఇచ్చి మోసపోరాదని కాకాని సూచించారు. 


Also read: Anandaiah Medicine: బుక్ చేస్తే చాలు..ఇంటికే ఆనందయ్య కరోనా మందు


ఇదిలావుంటే, కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు (Krishnapatnam medicine for corona) తయారీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్‌ను నిర్మిస్తున్నారు. మొదట తన పూర్వ స్థలంలోనే ఔషధం తయారుచేసి పంపిణీ చేస్తానని ఆనందయ్య (Anandayya latest updates) చెప్పినప్పటికీ.. నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఉన్న ఆదేశాల మేరకు చివరకు ఆనందయ్య పోర్టు స్థలంలోని అకాడమిని ఎంచుకోకతప్పలేదు.


Also read: Anandaiah Corona Medicine: ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తారు..ఏ మందు దేనికి వాడాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook