Anandaiah Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

AP Govt Gives Permission To Anandaiah Ayurvedic Medicine: కరోనాతో పోరాడుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయిన రోజే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

Written by - Shankar Dukanam | Last Updated : May 31, 2021, 02:45 PM IST
Anandaiah Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Anandaiah Ayurvedic Medicine:  ఏపీ ప్రజలకు శుభవార్త. ఎట్టకేలకు ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోదన సంస్థ (CCRAS) కమిటీ గత కొన్ని రోజులుగా చేసిన పరిశీలన నివేదిక రావడంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య  కరోనా బాధితులకు అందిస్తున్న ఆయుర్వేద ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కంట్లో వేస్తున్న చుక్కల మందుకు తప్ప ఇతర ఆయుర్వేద మందుల వరకు ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Also Read: Retired Headmaster Kotaiah Dies: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి 

ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు తిసుకున్నప్పటికీ ఇతర మందులు వాడకుండా ఉండొద్దని రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం సూచించింది. ఆ మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, సహజ సిద్ధంగా దొరికిన పదార్థాలతో ఔషధాలు తయారు చేసినట్లు నిర్ధారించింది. కంట్లో వేసే చుక్కల మందుపై పూర్తి నివేదిక రావడానికి మరో 2 లేదా 3 వారాల సమయం పడుతుందని పేర్కొంది. అయితే ఆనందయ్య ఆయుర్వేద మందు (Anandayya Ayurvedic Medicine) వాడితే కోవిడ్-19 తగ్గుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు కంట్లో చుక్కల మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోవడం తెలిసిందే.

Also Read: Actor Sonu Sood: ఏపీ, తెలంగాణ ప్రజలకు నటుడు సోనూ సూద్ మరో సాయం

కరోనా బాధితులు మాత్రం మెడిసిన్ పంపిణీ కేంద్రానికి వెళ్లకూడదని హెచ్చరించింది. కేవలం వారి బంధువులు, సన్నిహితులు మాత్రమే వెళ్లి ఆయుర్వేద మందు తీసుకురావాలని సూచించింది. చ‌ట్ట‌ ప్ర‌కారం ఆనంద‌య్య మందు పంపిణీకి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని ఆనంద‌య్య త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాదించారు. అయితే ఏపీ ప్రభుత్వమే ఆనందయ్య మందును అధికారికంగా పంపిణీ చేయాలని మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిష‌న్‌పై సైతం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News