CID Raids: ఆప్కో మాజీ చైర్మన్ ఇంట్లో భారీగా సొత్తు స్వాధీనం
ఆప్కో (APCO) మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు (Gujjala Srinivasulu ) ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదు, బంగారం వెండిన స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు విలువైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
CID raids former APCO chaiman Gujjala Srinivasulu house : అమరావతి: ఆప్కో ( APCO ) మాజీ చైర్మన్, టీడీపీ నేత గుజ్జల శ్రీనివాసులు (Gujjala Srinivasulu ) ఇంట్లో సీఐడీ ( CID ) అధికారులు సోదాలు జరిపి భారీ మొత్తంలో నగదు, బంగారం వెండిన స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు విలువైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా శ్రీనివాసులకు చెందిన అనేక మంది కుటుంబ సభ్యుల నివాసాలపై కూడా దాడులు చేస్తున్నారు. నిన్న వైఎస్సార్ జిల్లా ఖాజీపేట పట్టణంలోని శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు జరిపి 3 కిలోల బంగారం, 2 కేజీల వెండి, రూ. కోటికిపైగా నగదు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. Also read: ISIS: రాజధానిలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్
ఆప్కోలో అక్రమాలపై సమాచారం అందుకున్న అధికారులు కోర్టు అనుమతితో శుక్రవారం శ్రీనివాసులు ఇంటితోపాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు వ్యక్తుల ఇళ్లల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ( TDP ) ప్రభుత్వ హయాంలో ఆప్కోలో జరిగిన అవకతవకల కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అయితే 2016 ఆగస్టులో ఆప్కో చైర్మన్‌గా శ్రీనువాసులు బాధ్యతలు చేపట్టి చేనేత వస్త్రాల ముసుగులో అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపణలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో సోదాల కలకలం మొదలు కావడంతో పలువురు నేతల్లో భయాందోళనలు అలుముకున్నాయి. Also read: Chiranjeevi: హ్యాపీ బర్త్ డే మెగాస్టార్