Chandrababu naidu brother ramamurthy passed away: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు.. రామ్ముర్తినాయుడు కొద్ది సేపటి క్రితం చనిపోయినట్లు తెలుస్తొంది. దీంతో  ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం  చంద్రబాబు నాయుడు, నారాలోకేష్ హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తొంది.  ఈరోజు ఉదయం నుంచి నారా రామ్ముర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈక్రమంలో కాసేటి క్రితమే రామ్ముర్తి నాయుడు  చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం చంద్రబాబు ఇప్పటికే మహారాష్ట్రలోని ఎన్నికల ప్రచారం కార్యక్రమాలు రద్దుచేసుకున్నారం.. ఈ క్రమంలో  మధ్యాహ్నం నేరుగా ఏఐజీ ఆస్పత్రిక వెళ్లనున్నట్లు తెలుస్తొంది. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తొంది. అయితే.. నారా రామ్మూర్తి నాయుడు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నారా కుటుంబం ఈ ఘటనతో షాక్ లో ఉన్నారంట. నందమూరీ బాలయ్య కూడా నేరుగా హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు టీడీపీ వర్గాలు, మరోవైపు నారా వారి కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.


మరోవైపు ఈరోజు నారా రామ్మూర్తి నాయుడు డెడ్ బాడీని ఈరోజు నారావారి పల్లెకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. రేపు ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నారా వారి పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకొవచ్చు. మరోవైపు నారా రామ్మూర్తి నాయుడు..1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు.


Read more: Amrapali Kata: ఏపీ సర్కారుకు బిగ్ ట్విస్ట్.. సెలవులపై వెళ్లిపోయిన ఆమ్రపాలీ కాట.. ఎందుకో తెలుసా..?


నారా రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. నారా రోహిత్ ఎంగెజె మెంట్ ఇటీవల.. ప్రతినిధి 2 హీరోయిన్ సిరిలెల్లాతో జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హైదరబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు,  ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, సిని రంగ ప్రముఖులు, నేతలు హజరైన విషయం తెలిసిందే.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.