Old Districts: సీఎం చంద్రబాబు మరో సంచలనం.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ 13 జిల్లాలు?
Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్ జగన్ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
Andhra Pradesh Districts: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిపాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన జిల్లాల విభజనపై యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నాటి సీఎం వైఎస్ జగన్ లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జిల్లాల విభజన చేపట్టగా తాజాగా వాటిని రద్దు చేసి పూర్వ జిల్లాలనే కొనసాగించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు మళ్లీ పాత జిల్లాలు? కొత్త జిల్లాలతో వచ్చిన ఇబ్బందులు ఏమిటో తెలుసుకుందాం.
Also Read: AP Drone System: ఏపీ శాంతిభద్రతల్లో మరో పోలీస్ 'డ్రోన్'.. సీఎం చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో కొత్త విధానాలను రద్దు చేస్తూ వచ్చింది. ఇసుక పాలసీ, మద్యం విధానం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లాల విభజనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను లోక్‌సభ సెగ్మెంట్ కేంద్రంగా ఒక జిల్లాగా గుర్తిస్తూ మొత్తం 26 జిల్లాలను చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు ఉండగా.. విశాఖపట్టణంలో పెద్ద నియోజకవర్గాలు ఉండడంతో వాటిని రెండుగా విభజించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి.
Also Read: Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రోగ్రామ్
కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాల విభజనతో పెద్దగా సమస్యలు, ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ పలుచోట్ల మాత్రం జిల్లాల పేర్లు మార్చాలనే డిమాండ్లు ఉన్నాయి. దీనికితోడు కలెక్టర్లకు భవనాలు లేకపోవడంతో కలెక్టర్ల కోసం అద్దె భవనాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలతో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉందని ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఇదే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి.
తిరిగి కొత్త జిల్లాలన్నింటిని రద్దు చేసి ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాత 13 జిల్లాలనే కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వ యంత్రాంగం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉన్నాయి అనే విషయం పై క్లారిటీ రానుంది.ఇక జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఇసుక పాలసీ మద్యం విధానాన్ని కూడా రద్దు చేసే ఉచిత ఇసుక పాలసీతోపాటు పాత విధానంలోనే మద్యం దుకాణాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందా అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు.ఇక తాజాగా ఈ 26 జిల్లాలు అనే ప్రాతిపదికను కూడా చంద్రబాబు నాయుడు రద్దుచేసి పాత జిల్లాలనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.