Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రోగ్రామ్‌

Chandrababu Naidu Review On One Family One Entrepreneur: పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలకు సీఎం చంద్రబాబు శుభవార్త వినిపించారు. గృహిణులను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 3, 2024, 10:51 PM IST
Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ప్రోగ్రామ్‌

Self Help Groups: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. స్వయం సహాయక గ్రూపు మహిళలకు ప్రోత్సాహం కల్పించి పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు సహకరించాలని సీఎం నిర్ణయించారు. దీనికోసం సరికొత్తగా ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 'ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త' అనే కార్యక్రమం త్వరలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

Also Read: YS Sharmila: కళ్లు తెరచిలోపే జగనన్న పోర్టులు అమ్మాడు.. మీరు ఏం చేస్తున్నారు?

 

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సెర్ప్, మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని ఎస్‌హెచ్‌జీలను వాటి ఆదాయ ఆర్జన ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజించాలని సెర్ప్, మెప్మా అధికారులకు సూచించారు. నాన్ లాక్‌పతి, లాక్‌పతి, మైక్రో, స్మాల్, మీడియం కేటగిరీలుగా గ్రూపులను విభజించాలని చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు.

Also Read: Pawan Kalyan: సముద్రంలో పవన్‌ కల్యాణ్‌ 'సీజ్‌ షిప్‌' వెనుక పెద్ద ప్లానే? నిజం తెలిసి టీడీపీ దిగ్భ్రాంతి

 

స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా సంఘాలకు లబ్ది చేకూర్చాలని చెప్పారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కనీసం లక్ష ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుని ఆర్ధికంగా బలోపేతమయ్యేలా స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ అందించాలని చెప్పారు.

స్వయం సహాయక గ్రూపుల కేటగిరి ఇలా
నాన్ లాక్‌పతి:
ఏడాదికి రూ.లక్ష కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపు
లాక్‌పతి: రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు
మైక్రో: రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలోపు
స్మాల్: రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు
మీడియం: రూ.కోటి కన్నా ఎక్కువ ఆర్జన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News