Ap: కరోనా రావడం పాపం కానేకాదు: వైఎస్ జగన్
కోవిడ్19 వైరస్ రావడమన్నది పాపమూ కాదు..నేరమూ కాదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) స్పష్టం చేశారు. కరోనా ఎవర్న ఉపేక్షించడం లేదన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మరోసారి జగన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో సమర్ధవంతంగా కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus ) ను ఎదుర్కొనే క్రమంలో అధికార్లు బాగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి మిలియన్ కు 31 వేల పరీక్షలు సరాసరిన చేస్తున్నామన్నారు. గత కొన్నిరోజులుగా రోజుకు 50 వేల పరీక్షలు చేసే (Covid 19 tests in ap ) సామర్ధ్యాన్ని పెంచామన్నారు సీఎం వైఎస్ జగన్. కేసులు పెరుగుతున్నాయనే భయంతో తక్కువ చేసి చూపించడం లేదా పరీక్షలు ఆపేయడం వంటివి చేయడం లేదన్నారు.
కోవిడ్ వైరస్ తో కలిసి జీవించే పరిస్థితులున్నాయని జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ సోకడమనేది పాపమూ, నేరమూ కాదన్నారు. మధ్యప్రదేశ్ సీం కు కూడా కరోనా సోకిందనే విషయాన్ని గుర్తు చేశారు. వైరస్ వస్తుందీ..పోతుందని...మనం చేయాల్సినవి పూర్తిగా చేయాలని సూచించారు. కోవిడ్ సోకిన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఉన్నట్టు ఆధునిక కార్పొరేట్ ఆసుపత్రులు లేకపోయినా...మరణాల రేటును 1.08కి పరిమితం చేయగలిగామన్నారు జగన్. Also read: AP: విశాఖలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం