YSR Kalyanamasthu: లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ.. రూ.87.32 కోట్ల ఆర్థిక సహాయం: సీఎం జగన్
CM YS Jagan Mohan Reddy: కళ్యాణ్ మస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. 12,132 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది.
CM YS Jagan Mohan Reddy: వివాహాలకు చేసుకున్న పేదలకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆర్థికంగా ఆదుకోవడం ఒక్కటే కాకుండా.. ఇలా చేయడంలో పదోతరగతి కచ్చితంగా చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చామన్నారు. అప్పుడే కళ్యాణమస్తు, షాదీతోఫాలు వర్తిస్తాయని స్పష్టంగా చెప్పామని అన్నారు. దీనివల్ల పదోతరగతి వరకూ చదివించాలన్న తప్పన ప్రతి పేద కుటుంబంలో కూడా మొదలవుతుందన్నారు. శుక్రవారం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించారు. జనవరి-మార్చి త్రైమాసికంలో వివాహాలకు చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా రూ.87.32 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆడపిల్లకు 18 ఏళ్లు ఉండాలి.. అబ్బాయికి కచ్చితంగా 21 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన పెట్టామని చెప్పారు. పదోతరగతి అయ్యేసరికి అమ్మాయికి 15 ఏళ్లు నిండుతుందని.. ఆ తర్వాత వివాహం కోసం మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందన్నారు. అందువల్ల నేరుగా ఇంటర్మీయడిట్‌కు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని.. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఫీజు రీఎయింబర్స్‌మెంట్ వర్తింపచేస్తున్నామన్నారు. జగనన్న వసతి దీవెనకూడా డిగ్రీ విద్యార్థులకు ఇస్తున్నామని చెప్పారు.
'ప్రతి పిల్లాడు కూడా కనీసం డిగ్రీ వరకూ చదివే కార్యక్రమానికి అడుగులు పడతాయి. జగనన్న అమ్మ ఒక ప్రోత్సాహకంగా నిలిస్తే.. రెండో ప్రోత్సాహకంగా జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ఉంటుంది. ఇక మూడో ప్రోత్సాహకంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా నిలుస్తుంది. పేదరికం పోవాలంటే ఒకే ఒక్క మార్గం చదువులు మాత్రమే. చదువులు ఉంటేనే.. మెరుగైన ఉద్యోగాలు వస్తాయి.
అప్పుడే పేదరికం నుంచి బయటకు వస్తాయి. ఇవాళ లబ్ధిదారులైన వారిలో దాదాపు 6 వేల జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందుకుంటున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఎన్నికలకోసం చేశామంటే.. చేశాం అన్నట్టుగా చేసింది. 17,709 మంది జంటలకు డబ్బులు ఎగరగొట్టింది. దాదాపు రూ.70 కోట్లు ఎగరగొట్టింది.
ఇచ్చేది తక్కువే అయినా.. డబ్బులు ఎగరగొట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీసీ సోదరులకు మంచి జరగాలని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఎస్సీలకు గతంలో 40 వేలు ఇస్తామని చెప్పి.. ఇవ్వలేదు. మనం ఎస్సీలకు లక్ష రూపాయలు అందిస్తున్నాం. ఎస్టీలకు గతంలో రూ.50 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బు కూడా ఇవ్వలేదు. మనం వీరికి రూ.లక్ష రూపాయలకు పెంచాం. బీసీలకు గతంలో 35 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు. మనం వీరికి రూ.50 వేలకు పెంచాం. అలాగే విభిన్న ప్రతిభావంతులకైతే లక్షన్నర వరకూ పెంచాం. ఇలా ప్రతి కేటగిరీలో కూడా ఇచ్చే డబ్బును పెంచాం..' అని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.
Also Read: IND vs PAK Match: భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook