CM Jagan Meet PM Modi: నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్... ఆ అంశాలే ప్రధాన ఎజెండా..
CM Jagan Meet PM Modi: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
CM Jagan Meet PM Modi: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు (ఆగస్టు 22) ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు ఇద్దరి మధ్య భేటీ జరగనుంది. మోదీతో జగన్ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం నిధులు, మూడు రాజధానులు, ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు తదితర అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,656 కోట్లకు సవరించగా.. కేంద్రం మాత్రం 2013 అంచనాల మేరకే నిధులు చెల్లిస్తామని చెబుతోంది. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉన్నందునా సవరించిన అంచనాల మేరకు కేంద్రం నుంచి నిధుల విడుదలకు సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
నేటి భేటీలో జాతీయ ఆహార భద్రతా చట్టంలో లోపాలపై కూడా జగన్ ప్రధానితో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇచ్చే రేషన్ హేతుబద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం. ఇక భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్లియరెన్సులు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీకి నిధులపై కూడా సీఎం ప్రధానితో చర్చించనున్నారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌లతోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Megastar Chiranjeevi Birthday Special: మొగల్తూరు టు ఫిలింనగర్.. స్వయంకృషే పెట్టుబడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook