Horoscope Today August 22nd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం..

ఇవాళ సోమవారం. ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. సోమవారం నాడు శివ మంత్రాన్ని పఠిస్తూ శివుడిని పూజిస్తే సత్ఫలితాలు పొందుతారు. మరి ఈ సోమవారం ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 06:49 AM IST
  • ఇవాళ సోమవారం.. పరమ శివుడికి అంకితం
  • శివుడి మంత్రాన్ని పఠిస్తూ పూజ చేస్తే మంచి ఫలితాలు
  • ఈ సోమరం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today August 22nd : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి కుటుంబంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం..

Horoscope Today August 22nd 2022: ఇవాళ సోమవారం. ఆ పరమేశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. సోమవారం నాడు శివ మంత్రాన్ని పఠిస్తూ శివుడిని పూజిస్తే సత్ఫలితాలు పొందుతారు. మరి ఈ సోమవారం ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

చంద్ర అనుగ్రహం లభిస్తుంది. రోజంతా హ్యాపీగా గడుపుతారు. మీ చుట్టూ ఉండే వ్యక్తులతో మర్యాదపూర్వకంగా మెలుగుతారు. బిజినెస్‌లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా వ్యాపారంలో పెద్ద ఆర్డర్ పొందుతారు. తద్వారా మీ ఆర్థికి స్థితి మరింత మెరుగవుతుంది. ఒకేసారి భారీగా డబ్బు అందుకుంటారు.

వృషభ రాశి (Taurus)

ఇవాళ చంద్రుడి అనుగ్రహంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అంతరంగ శక్తి మిమ్మల్ని అన్నింటా ముందుకు నడిపిస్తుంది. చేపట్టిన ప్రతీ పనిని ఆస్వాదిస్తారు. జీవిత భాగస్వామి లేదా ప్రేయసి/ప్రియుడితో రొమాంటిక్‌గా గడుపుతారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు కొత్త ప్లాన్స్ రూపొందించుకుంటారు. మీ పర్ఫెక్షన్ అందుకు దోహదడపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది.

మిథున రాశి (GEMINI)

ఇవాళ మీకు నిరాశజనకంగా ఉండొచ్చు. మీ అహంకారాన్ని, మాటలను అదుపులో పెట్టుకోవాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలపై చర్చించి చీటికి మాటికి గొడవలు పడవద్దు. అది మీ రిలేషన్‌షిప్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తే మిమ్మల్ని చుట్టుముట్టిన నెగటివిటీ దూరమవుతుంది.

కర్కాటక రాశి (Cancer) 

మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బిజినెస్‌లో భారీ పెట్టుబడికి సిద్ధమవుతారు. ఆర్థికంగా మునుపటికన్నా ఎక్కువ రాబడి ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. బ్యాచిలర్స్‌కు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి. తగిన జోడీ దొరుకుతుంది.ప్రేమికులు పెళ్లి విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. నష్టాలన్నీ లాభాలుగా మారుతాయి. వ్యాపారంలో మీ ఎదుగుదల మీ ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తుంది. మార్కెట్‌లో మీ పేరు బాగా వినబడుతుంది. ఉద్యోగస్తులు బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రస్తుతం ఉంటున్న చోటు నుంచి మరో చోటుకు మారే ఆలోచనలో ఉంటారు. బంధువుల సాయంతో ప్రేమికులు పెళ్లిపై నిర్ణయం తీసుకుంటారు.

కన్య రాశి (Virgo)

చంద్ర అనుగ్రహంతో ఆరోగ్యం బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యలు నయమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మతపరమైన లేదా స్వచ్చంద సంస్థలకు తోచిన సాయం అందిస్తారు. స్థిరాస్తి వివాదాలేమైనా ఉంటే పరిష్కారమవుతాయి. ప్రాజెక్టు పని రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తారు. 

తులా రాశి (Libra)

ఇవాళ మిమ్మల్ని నెగటివిటీ వెంటాడుతుంది. చంద్రుడి ప్రతికూల ప్రభావం మీపై ఉంటుంది. కొన్ని కుట్రలకు మీరు బాధితులుగా మిగిలే అవకాశం ఉంది. వివాదాల్లో తలదూర్చవద్దు. మీ సంకల్పం, పెద్దల ఆశీస్సులు మీకు ఎదురయ్యే నెగటివిటీని అధిగమించేందుకు దోహదపడుతాయి. కుటుంబ జీవితంలో గందరగోళ పరిస్థితులు నెలకొనవచ్చు. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు.

వృశ్చిక రాశి (Scorpio)

పనిలో తీరిక ఉండదు. అయినప్పటికీ ఉత్సాహంగా పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. చాలా స్పీడ్‌గా ముందుకెళ్తారు. కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతారు. అయితే పార్ట్‌నర్‌షిప్‌తో పెట్టుబడులు పెట్టవద్దు. అది మున్ముందు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius)  

చంద్ర అనుగ్రహంతో మీలోని శక్తి, సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. పనిలో మరింత మెరుగ్గా రాణిస్తారు. ప్రస్తుతం ఉన్న జాబ్ నుంచి మరో జాబ్‌లోకి మారే ప్రయత్నాలు చేస్తారు. సీనియర్లతో మీ సంబంధాలు మరింత బలపడుతాయి. పాత అనారోగ్య సమస్యలు నయమవుతాయి. కెరీర్ పరంగా అంతా అనుకూలమే. వ్యాపారస్తులకు కూడా అన్నివిధాలుగా కలిసొస్తుంది.

మకర రాశి (Capricorn) 

చంద్ర అనుగ్రహం కలుగుతుంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. చేపట్టిన పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. త్వరగా దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల్లో మీ చతురత మంచి ఫలితాలనిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. 

కుంభ రాశి (Aquarius)

ఇవాళ నిరాశ ఆవహిస్తుంది. రోజంతా అసంతృప్తి వెంటాడుతుంది. అహంకారాన్ని వీడకపోతే మరిన్ని సమస్యలు చుట్టుముడుతాయి. అది వృత్తి జీవితం, కుటుంబ జీవితంపై  ప్రభావం చూపుతుంది. మీలో అంతర్గతంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. క్రియేటివ్ ఆలోచనలు కూడా తగ్గుతాయి. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండొచ్చు.

మీన రాశి (Pisces) 

ఇవాళంతా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. పనిలో బాగా రాణిస్తారు. చాలా కష్టపడి పనిచేస్తారు. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదాలు, తగాదాలు పరిష్కారమవుతాయి. ఒక వ్యక్తితో భేటీ అవడం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. జీవిత భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also READ: iPhone 14 Pre Booking Date: ఐఫోన్ 14 ప్రీ బుకింగ్ ఎప్పటి నుంచి, ధర ఎంతో తెలుసా

Also READ: CM Kcr: త్వరలో జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్..నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News