Andhra Pradesh Covid-19 Cases updates : అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా.. వందకు చేరువలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఏపీ‌ ( Andhra Pradesh ) లో గత 24 గంటల్లో కొత్తగా 9,544 కరోనా కేసులు నమోదు కాగా.. 91 మంది మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) శుక్రవారం సాయంత్రం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,34,940కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 3,092కి చేరింది. Also read: India: రికార్డు స్థాయిలో కరోనా రికవరీలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 55,010 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 31,29,857 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 87,803 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 2,44,045 మంది కోలుకున్నారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా గత 24గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరిలో 13, నెల్లూరులో 12, తూర్పు గోదావరిలో 11 మరణించారు. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..


[[{"fid":"191200","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read: Lalu Prasad Yadav: లాలూ సెక్యూరిటీలో 9 మందికి కరోనా