Andhra Pradesh: 3లక్షలు దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. నిరంతరం భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.
AP Covid-19 Cases: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకీ విజృంభిస్తూనే ఉంది. నిరంతరం భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదు కాగా.. 88మంది ఈ మహమ్మారి కారణంగా మరణించినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) మంగళవారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 2,820 మంది మరణించారు. Also read: Vande Bharat Mission: ఎయిరిండియా విమానాలపై నిషేధం
ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 2,18,311 మంది కోలుకున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 56,090 టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు 29,61,611 కరోనా నమూనాలను పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1396 కేసులు నమోదు కాగా.. చిత్తూరు 990, విశాఖపట్నంలో 928 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసులు.. మరణాల వివరాలు..
[[{"fid":"190944","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ap coronavirus cases","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ap coronavirus cases","field_file_image_title_text[und][0][value]":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"ap coronavirus cases","title":"ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]