AP COVID-19: 30 వేలకు చేరువలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రోజురోజుకు కరోనావైరస్ ( Coronavirus) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
Coronavirus: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజురోజుకు కరోనావైరస్ (Coronavirus) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో నమోదైన కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 30వేలకు చేరువలోకి వచ్చింది. ఆదివారం ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం.. గత 24గంటల్లో 17,624 శాంపిళ్లను పరీక్షించగా 1,933 పాజిటీవ్ కేసులను నిర్ధారించారు. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 18 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరింది. Also read: YSR BOOK: తెలుగు పుస్తకాల్లో రికార్డు సాధించిన నాలో..నాతో..YSR
గత 24గంటల్లో కరోనాతో 19 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 328 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. గత 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన 846మందితో ఇప్పటివరకు మొత్తం 15,412 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,428 మంది పలు హాస్పటళ్లల్లో చికిత్స పొందుతున్నారు. Also read: Amitabh: నిలకడగా ఆరోగ్యం: జయాబచ్చన్‌కు నెగెటివ్, ఐశ్వర్యారాయ్‌కు పాజిటివ్
ఇప్పటివరకు నమోదైన 29,168 కరోనా కేసుల్లో.. ఏపీకి చెందిన వారు 26,336మంది ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 2,403 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 429 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,53,849 మందికి కరోనా పరీక్షలు చేశారు. Also read: Rajasthan: సంక్షోభంలో గెహ్లాట్ ప్రభుత్వం