కరోనా సంక్రమణ భయం అంతకంతకూ పెరుగుతోంది. ఎవర్నీ ఖాతరు చేయకుండా విస్తరిస్తున్న ఈ మహమ్మారి వీవీఐపీలకు దడ పుట్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న తెలంగాణలోని ప్రగతి భవన్ ...ఇప్పుడు ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం. రెండింటా కరోనా కేసులు నిర్దారణ కావడంతో ఆందోళన ఎక్కువైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఇప్పుడు కరోనా కలవరం రేపుతోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో విధుల్ని నిర్వహిస్తోన్న సిబ్బందిలో 8 మంది కానిస్టేబుళ్లకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలడంతో ఆందోళన నెలకొంది. వీరంతా ఏపీపీఎస్సీ కాకినాడ బెటాలియన్ కు చెందినవారు. రెండ్రోజుల క్రితం సీఎం నివాసపు భద్రతా సిబ్బందికి నిర్వహించిన కోవిడ్ 19 పరీక్షల ఫలితాల్ని ఇవాళ వెల్లడించారు. ఏకంగా 8 మందికి పాజిటివ్ గా రావడంతో అదికార యంత్రాంగం అవాక్కైంది. కరోనా సోకిన 8మందిని వెంటనే క్వారంటైన్ కు తరలించి....వీరితో కాంటాక్ట్ లో ఉన్న మిగిలినవారికి పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికార్లు. ఈ భద్రతా సిబ్బంది కుటుంబసభ్యులే కాకుండా..సీఎం క్యాంపు కార్యాలయంలోని ఇతర సిబ్బంది కూడా కరోనా బారిన పడి ఉండే అవకాశాల్లేకపోలేవని అధికారులు భావిస్తున్నారు. Also read: Ponnur MLA: పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కోవిడ్ పాజిటీవ్


ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు కరోనా తాకింది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 20 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణైంది. ఈ నేపధ్యంలో ప్రగతి భవన్ లో పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు  చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కూడా కరోనా వైరస్ చేరడంతో అధికారవర్గాలు అప్రమత్తమయ్యాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..