IMD Red Alert: ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
Severe Heavy Rains Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఆ తరువాత తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇంట్లోంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.
Severe Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా తీరం దాటవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీకు తుపాను హెచ్చరిక జారీ అయింది. అల్పపీడనం బలపడుతూ రేపటికి వాయుగుండంగా మారవచ్చు. వాయుగుండం కాస్తా తుపానుగా మారి ఈ నెల 17వ తేదీన చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా. తీరం దాటే సమయంలో నెల్లూరూ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా. అటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతితో పాటు తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
ఇక తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక ఉంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు ముప్పు పొంచి ఉంది. ఈ జిల్లాల్లో ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
Also read: AP Liquor Shops: ఏపీ లిక్కర్ వ్యాపారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యూస్ ఛానెల్ ప్రతినిధులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.