Lockdown: కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూ, లాక్‌డౌన్ సత్ఫలితానిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లాక్‌డౌన్‌పై ఏం నిర్ణయం తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్ సడలిస్తున్నాయా లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖ పట్టినట్టే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఏపీలో మే 5వ తేదీ నుంచి రోజుకు 18 గంటల కర్ప్యూ(Curfew) అమలవుతుంటే..తెలంగాణలో మే 12 నుంచి రోజుకు 20 గంటల లాక్‌డౌన్(Lockdown) అమలవుతోంది. గత వారం రోజుల్నించి రెండు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అటు రికవరీ రేటు పెరుగుతోంది. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ అమలవుతున్న కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ రేపటితో అంటే మే 31వ తేదీతో ముగియనుంది. 


లాక్‌డౌన్ నిబంధనల కారణంగా ఇప్పడిప్పుుడే రెండు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య తగ్గుతోంది. ఈ తరుణంలో లాక్‌డౌన్ (Lockdown) సడలిస్తే మొదటికే ప్రమాదముండే అవకాశముందని..మరోసారి సంక్రమణ వేగం పుంజుకోవచ్చనే సంకేతాలు విన్పిస్తున్నాయి. అందుకే లాక్‌డౌన్ లేదా కర్ప్యూని కొనసాగిస్తూనే..ఫీవర్ సర్వేను మరింత ముమ్మరం చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నట్టు సమచారం. తెలంగాణ(Telangana) లో జూన్ 6వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించేందుకు అవకాశాలున్నాయి. అటు ఏపీ(AP) లో మరో రెండు వారాల పాటు అంటే జూన్ 14 వరకూ కర్ఫ్యూ పొడిగించవచ్చని తెలుస్తోంది. దేశంలో ఢిల్లీ (Delhi) తప్ప మిగిలిన చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ పొడిగింపు జరుగుతోంది. 


Also read: Monsoon: రుతుపవనాలు ఎప్పుడు..తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల్లో వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook