Devineni Uma Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు వరుసగా రెండో రోజు హౌస్ అరెస్ట్ చేశారు. మైలవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తున్న క్రమంలో బుధవారం జి. కొండూరు బంద్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలు లేకుండా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావును తన ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు జి. కొండూరు బంద్‌కు మైలవరం రెవిన్యూ డివిజన్ పోరాట సాధన సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మార్పీఎస్‌‌లు మద్దతు తెలిపాయి. కాగా.. బంద్‌కు అనుమతులు ఇవ్వని పోలీసులు, దుకాణలను బలవంతంగా ముసివేయిస్తే అరెస్ట్‌‌లు చేస్తామని నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.


అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు కలిగించినా జి.కొండూరు బంద్‌ను విజయవంతం చేస్తామని సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. పోలీసుల నిరంకుశ తీరుపై విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: AP Weather Report: వాతావరణ శాఖ రిపోర్ట్.. రానున్న మూడు రోజుల్లో మార్పులు!


Also Read: AP Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు- టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook