Eggs Thrown at Nara Lokesh: క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌ చేస్తున్న నారా లోకేష్ పై గుడ్ల‌తో దాడిచేశారు. అయితే ఆ గుడ్లు నారా లోకేష్ కి కాకుండా ఆయన సెక్యూరిటీ సిబ్బందికి త‌గిలాయి. దీంతో లోకేష్ సెక్యూరిటీ అప్ర‌మ‌త్తం అయింది. ప్రొద్దుటూరు శివాలయం సెంట‌ర్‌లో బ‌హిరంగ స‌భ ముగించుకుని ఆర్టీసి బ‌స్టాండ్ దాటిన త‌రువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్ర‌జ‌లతో మాట్లాడుతుండ‌గా ఈ గుడ్ల దాడి జ‌రిగింది. ప్రొద్దుటూరులో లోకేష్ యువ‌గ‌ళం సంద‌ర్భంగా సుమారు 500 ల మందికి పైగా పోలీసులు సెక్యూరిటీ బందోబస్తు విధుల్లో ఉన్న‌ప్ప‌టికీ.. లోకేష్ పై గుడ్లతో దాడి జ‌ర‌గడంపై టిడిపి వ‌ర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇది పోలీసుల వైఫ‌ల్యమే అవుతుంది అని టీడీపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంద‌ర్భంగా పోలీసులపై నారా లోకేష్ సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తుండగా.. వారి నుండి పోలీసులు ఆ వ్యక్తిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గురువారం ఉదయం చౌటపల్లి క్యాంప్ సైట్ నుండి 113వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్... సాయంత్రం 6 గంటలకు ప్రొద్దుటూరుకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.


పొద్దుటూరు సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని.. అలాగే మినీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశాం అని అన్నారు. యువతను, నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను ఏర్పాటు చేసేలా టిడిపి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తాం అని అన్నారు. రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే ఆ మీటర్లను పగలగొట్టండి అంటూ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సంవత్సరం రైతులకు 20 వేల రూపాయలు పంట సాయం అందిస్తాం అని నారా లోకేష్ ప్రకటించారు.


ఇది కూడా చదవండి : Kodela Sivaram Slams Chandrababu: చంద్రబాబుపై కోడెల శివప్రసాద్ కుమారుడి సంచలన ఆరోపణలు


లక్ష కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసిన వాడు పేదవాడు అవుతాడా...
లక్ష కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసిన వాడు పేదవాడు అవుతాడా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒక టీవీ ఛానల్, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఊరికొక ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు ఎలా అవుతాడు అంటూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచి, ఆర్టీసీ చార్జీలు, పెట్రోలు, ఇంటి పన్ను, చెత్త పన్నులు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించిన నారా లోకేష్.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు సంత్సరాలలో ప్రజల ఆదాయం రెట్టింపు చేసే బాధ్యత తెలుగు దేశం పార్టీ తీసుకుంటుంది అని స్పష్టంచేశారు.


ఇది కూడా చదవండి : Nara Lokesh Comments on AP CM YS Jagan: మినీ మ్యానిఫెస్టోకే వైసిపి నేతలు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు


ఇది కూడా చదవండి : CM Jagan Mohan Reddy: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK