నెల రోజులనుంచి ఎప్పుడెప్పుడా అని తెలుగు తమ్ముళ్లు ఎదరుచూస్తున్న తెలుగుదేశం పార్టీ (TDP)  కమిటీలను అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. టీడీపీ పొలిట్‌బ్యూరో, పార్టీ కేంద్ర కమిటీ, తెలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల పేర్లతో పాటు కమిటీ సభ్యుల వివరాలతో ప్రకటన విడుదల చేశారు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడుని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. 25 మందితో పొలిట్ బ్యూరో, 27 మందితో సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీడీపీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణనే కొనసాగిస్తున్నారు. నేషనల్ పొలిటికల్ ఎఫైర్స్ జనరల్ సెక్రటరీగా కంభంపాటి రామ్మోహన్‌కు బాధ్యతలు అప్పటించారు. బావ నందమూరి బాలకృష్ణను టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి చంద్రబాబు తీసుకున్నారు. నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, పితాని, శ్రీనివాసరెడ్డి, కొల్లు రవీంద్రలకు సైతం పొలిట్ బ్యూరోలోకి చోటు కల్పించారు. జాతీయ కమిటీలో ఆరుగురు ఉపాధ్యక్షులు, 8 మందిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.




 


 


 


 


టీడీపీ సెంట్రల్ కమిటీ (TDP Central Committee)


  • ప్రతిభా భారతి (జాతీయ ఉపాధ్యక్షులు)

  • గల్లా అరుణకుమారి (జాతీయ ఉపాధ్యక్షులు)

  • డీకే సత్యప్రభ  (జాతీయ ఉపాధ్యక్షులు)

  • కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  (జాతీయ ఉపాధ్యక్షులు)

  • మెచ్చా నాగేశ్వరరావు (జాతీయ ఉపాధ్యక్షులు)

  • సీహెచ్. కాశీనాథ్ (జాతీయ ఉపాధ్యక్షులు)



టీడీపీ సెంట్రల్ జనరల్ సెక్రటరీలు  (TDP Central General Secretary)


  • నారా లోకేష్

  • వర్ల రామయ్య

  • కింజారపు రామ్మోహన్ నాయుడు

  • నిమ్మల రామానాయుడు

  • బీద రవిచంద్ర

  • కొత్తకోట దయాకర్ రెడ్డి

  • బక్కని నర్సింహులు

  • కంభంపాటి రామ్మోహన్‌రావు (సెంట్రల్ జనరల్ సెక్రటరీ ఫర్ నేషనల్ పొలిటికల్ అఫైర్స్)

  • టీడీ జనార్ధన్ రావు (పొలిటికల్ సెక్రటరీ) ఆర్గనైజేషన్

  • టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు (TDP Central Official Spokesperson)

  • గుణపాటి దీపక్ రెడ్డి

  • కొమ్మారెడ్డి పట్టాభిరామ్

  • మహమ్మద్ నసీర్

  • ప్రేమ్‌ కుమార్ జైన్

  • టీ జ్యోత్స్న

  • నన్నూరి నర్సిరెడ్డి

  • పరుచూరి అశోక్‌బాబు (సెంట్రల్ ఆఫీసు సెక్రటరీ)



 


టీడీపీ క్రమశిక్షణా సంఘం (Disciplinary Committee)


  • బచ్చుల అర్జునుడు (క్రమశిక్షణా సంఘం ఛైర్మన్)

  • పీఎస్ మునిరత్నం (సభ్యులు)

  • గుంటుపల్లి నాగేశ్వరరావు (సభ్యులు)

  • బంటు వెంకటేశ్వరరావు (సభ్యులు)

  • కోశాధికారి  (TDP Central Treasurer)

  • శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య 



టీడీపీ పొలిట్‌బ్యూరో (Telugu Desam Party Politburo)


  • యనమల రామకృష్ణుడు

  • అశోక్‌గజపతి రాజు

  • చింతకాయల అయ్యన్నపాత్రుడు

  • కేఈ కృష్ణమూర్తి

  • నిమ్మకాయల చినరాజప్ప

  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • కాల్వ శ్రీనివాసులు

  • నందమూరి బాలకృష్ణ

  • వర్ల రామయ్య

  • కె. కళా వెంకట్రావు

  • నక్కా ఆనందబాబు

  • గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • బొండా ఉమామహేశ్వరరావు

  • ఎన్‌ఎండీ ఫరూఖ్

  • గల్లా జయదేవ్

  • రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

  • పితాని సత్యనారాయణ

  • కొల్లు రవీంద్ర

  • వంగలపూడి అనిత

  • గుమ్మడి సంధ్యారాణి

  • రావుల చంద్రశేఖర్ రెడ్డి

  • అరవింద్ కుమార్ గౌడ్

  • నారా లోకేష్ (పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎక్స్ అఫిషియో సభ్యుడు)

  • కింజారపు అచ్చెన్నాయుడు (టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎక్స్ అఫిషియో సభ్యుడు)

  • ఎల్ రమణ (టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎక్స్ అఫిషియో మెంబర్)


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe