ప్రముఖ టీవీ నటి (TV Actress Zarina Roshan Khan) జరీనా రోషన్ ఖాన్(54) ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కార్డియాక్ అరెస్టయి నటి జరీనా తుదిశ్వాస విడిచినట్లు (Actress Zarina Roshan Khan Dies) సమాచారం. ఫేమస్ హిందీ టీవీ సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’తో ఆమె పాపులర్ అయ్యారు. ఆ సీరియల్‌లో ఇందు దాసి పాత్రలో నటించి మెప్పించారు జరీనా రోషన్ ఖాన్. ‘కుంకుమ్ భాగ్య’ సహనటీనటులు, బాలీవుడ్ సినీ వర్గీయులు జరీనా మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘కుంకుమ్ భాగ్య’ నటీనటులు షబ్బిర్ అహ్లువాలియా, శ్రుతి ఝా సోషల్ మీడియా వేదికగా నటి జరీనా మృతిపట్ల (Zarina Roshan Khan Death News) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ చంద్రుడి వలే కాంతివంతంగా మెరిసే అందం మీది అంటూ గతంలో జరీనాతో కలిసి దిగిన ఫొటోను షబ్బీర్ పోస్ట్ చేశాడు.
శ్రద్ధా ఆర్య, మృణాల్ ఠాకూర్, అంకిత్ మోహన్ తదితరులు షబ్బీర్ పోస్టుపై స్పందిస్తూ నటి జరీనా రోషన్ ఖాన్ సంతాపం తెలిపారు. ఆమెతో అనుబంధాన్ని గుర్తుకుచేసుకున్నారు. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వకకుముందు ఆమె కుంకుమ్ భాగ్యలో నటించారని మృణాల్ ఠాకూర్ పోస్ట్ చేశారు.
నటి జరీనా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోతో పాటు ఆమెతో తాను కలిసి దిగిన ఫొటోను నటి శ్రుతి ఝా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు ఆమె ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌తో పాటు ‘యే రిస్తా క్యా కెహతా’లోనూ నటి జరీనా నటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe