Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. మెట్ల మార్గంను మూసివేసిన టీటీడీ అధికారులు.. కారణం ఏంటంటే..?
Fengal cyclone: టీటీడీ శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ ను జారీ చేసిందని తెలుస్తొంది. ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఒక్కసారిగా భారీగా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
Heavy rains in Tirumala due to fengal cyclone: ప్రస్తుతం దేశంలో చలిపులి తన పంజా విసురుతుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో బంగాళ ఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను కూడా వాతావరణం మార్పులకు కారణమౌతుంది. దీని ప్రభావం వల్ల పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఏపీలోని పలు ప్రాంతాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది. అయితే.. తిరుమలలో కూడా ఈ తుపాను ప్రభావం వల్ల వర్షం కురుస్తుంది. దీంతో తిరుమల ఘాట్ రోడ్డులో భారీగా కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై.. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
అదే విధంగా శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులకు కూడా కీలక అలర్ట్ ను జారీ చేశారు. చలితీవ్రత, వర్షం నేపథ్యంలో తగు జాగ్రత్తలతో స్వామి వారి దర్శనం కోసం రావాలని చెప్పినట్లు సమాచారం. అదే విధంగా.. తిరుమల ఒక్కొసారిగా మంచు దుప్పటి కప్పినట్లుగా మారిపోయిందంట. దీంతో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారంట. కొందరు భక్తులు మెట్లమార్గంద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
అయితే.. వానల నేపథ్యంలో మెట్ల మార్గంను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారంట. వర్షం వలన అడవిలోని జంతువులు.. కొన్నిసార్లు మెట్ల మార్గంవైపుకువస్తుంటాయం. అందుకే.. ఈ మార్గంను ప్రస్తుతం భక్తులు వెళ్లకుండా.. తాత్కలికంగా మూసివేసినట్లు తెలుస్తొంది. మరల వర్షం తగ్గగానే.. తిరిగి భక్తులకు అనుమిస్తారని తెలుస్తొంది.
ఒకవైపు తుపాను, మరోవైపు చల్లని గాలులు మాత్రం.. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పుకొవచ్చు. కొత్త సంవత్సరం.. వస్తున్న నేపథ్యంలో చాలా మంది తిరుమలకు స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.
Read more: Minister Lokesh: తమ్ముడూ.. దిద్దలేని పెద్ద తప్పు చేశావ్.. ఎమోషనల్ అయిన లోకేష్.. అసలేం జరిగిందంటే..?
అదే విధంగా మార్గశిర మాసం, ధనుర్మాసం నేపథ్యంలో కూడా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో జలాశయాలు అన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో తిరుమల వాసులకు మాత్రం సమ్మర్ లో నీటి ఎద్దడి ఉండదని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.