TDP Activist Srinu suicide nara Lokesh emotional: సాధారణంగా కొంత మందికి రాజకీయాలు అంటే ఎంతో ఇష్టం. తమ అభిమాన నేత కోసం, పార్టీ కోసం ఏమైన చేస్తుంటారు. పార్టీ కార్యక్రమాల కోసం తమ జేబుల నుంచి ఖర్చులు చేసుకుంటారు. పార్టీకి చెందిన ప్రొగ్రామ్స్ లలో యాక్టివ్ గా ఉంటారు. తమ ప్రియతమ నాయకుడి జన్మదినాలు, పెళ్లి రోజులు.. ఏవైన గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు.
అన్నా.. అన్నా... అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.
ఆత్మాభిమానం ఉండొచ్చు.… pic.twitter.com/gpGa54kqMw
— Lokesh Nara (@naralokesh) December 1, 2024
ఇలాంటి నేపథ్యంలో.. కొన్ని సార్లు వారి ఇంట ఏదైన ఘటన జరిగితే.. ఎమోషనల్ అవుతుంటారు. ఈ క్రమంలో తమ అభిమాన నేత కోసం.. ఏమైన త్యాగాలు చేసేందుకు అస్సలు వెనుకాడరు. అయితే.. కొంత మంది నేతలు సైతం తమ అభిమానుల పట్ల అదేవిధంగా ప్రేమను, ఆప్యాయతను చూపిస్తుంటారు.
కార్యకర్త ఇంట్లో ఏది జరిగిన కూడా అక్కడికి వెళ్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ మంత్రి నారాలోకేష్ తన అభిమాని, పార్టీకార్యకర్త శ్రీను సూసైడ్ చేసుకొవడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
టీపీకి చెందిన డైహర్ట్ కార్యకర్త, శ్రీను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పట్ల టీడీపీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైందని తెలుస్తొంది. దీనిపై ఏకంగా మంత్రి నారాలోకేష్ స్పందించారంటే.. ఆ అభిమానికి టీడీపీ అంటే.. ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. శ్రీను చిన్న ప్పటి నుంచి టీడీపీ అంటే పడిచచ్చేవాడంట. అంతే కాకుండా.. టీడీపీ కార్యక్రమాలు.. నాయకులు ప్రొగ్రామ్ లకు తప్పకుండా హజరయ్యే వారంట. మరీ ఏజరిగిందో కానీ.. శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా పెనుదుమారంగా మారింది.
దీనిపై మంత్రి నారాలోకేష్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన పుట్టిన రోజు, పెళ్లి రోజు కార్యక్రమాల్ని.. శ్రీను పండగలా చేసేవాడని లోకేష్ చెప్పుకొచ్చారు. అలాంటి తనకు ఏంకష్టం వచ్చిందో.. ఒక్క మాట చెబితే.. వాటిని పరిష్కరించేవాడినని బాధపడ్డారు. ప్రతిసమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుందని.. ఇలాంటి పనులు చేయకూడని.. మనం బతికి . . మరికొందర్ని బతికించాలని కూడా నారా లోకేష్ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం ఆ కుటుంబానికి మాత్రం.. తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా నారా లోకేష్ అభయమిచ్చినట్లు తెలుస్తొంది. ఇలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకొవద్దని నారా లోకేష్ ఎక్స్ వేదికగా కోరినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.