Tirumala Fire Accident : తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా వ్యాపించిన పొగలు..
Tirumala: తిరుమల అడవుల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొన్నిరోజులుగా విపరీతమైన ఎండల కారణంగా అడవులలోని భారీ చెట్ల ఆకులన్ని రాలిపోయాయి. చెట్లు కూడా దట్టంగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శ్రీ గంధం వనప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
Fire Accident In Tirumala Forest: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీగంధం అడవి ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. అవి క్రమంగా అడవంతా చుట్టుముట్టాయి. అడవిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఫారెస్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అడవిలోకి జంతువులు బైటకు వచ్చే అవకాశం ఉండటంతో వెంటనే మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ లను రప్పించారు. అంతేకాకుండా.. మంటలు వ్యాపించకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సమ్మర్ లు, సెలవుల నేపథ్యంలో శ్రీవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పొటెత్తారు.
Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
దీని కోసం టీటీడీ ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించింది. ముఖ్యంగా సమ్మర్ లో భక్తులు ఎండకు విలవిల్లాడిపోతున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో కొన్ని చోట్ల గ్రీన్ కార్పేట్లు ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాలలో భక్తులు ఎండవేడికి కాళ్లు కమిలిపోతున్నాయని గగ్గొలు పెడుతున్నారు. అంతేకాకుండా.. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. రానున్న మరో రెండు నెలల పాటు కూడా ఇలాగే భక్తుల రద్దీ ఉండనుందని సమాచారం. ఈ క్రమంలోనే ఎక్కువ మంది భక్తులు నడక మార్గం గుండా వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే అనేక మార్లు నడక మార్గంలో భక్తులపై చిరుతపులులు దాడులు జరిపిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఫారెస్టు అధికారులు చిరుతలను కూడా బంధించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇక కొన్నిరోజులుగా ఎండలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. కనీసం బైటకు వెళ్లాలంటేనే , చాలా మంది గజగజ వణికిపోతున్నారు. అంతేకాకుండా.. ఉదయం పదికంటే ముందే,సాయత్రం మూడు తర్వాత మాత్రమే బైటకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడిమి నుంచి బైటపడేందుకు, శరీరం డీహైడ్రేషన్ కాకుండా..జ్యూస్ లు,నీళ్లు ఎక్కువగా తాగుతుండాలని చెప్తున్నారు.
ముఖ్యంగా ఎండాకాలంలో జంతువులు అడవులనుంచి బైటకు వస్తుంటాయి. కొన్నిసార్లు అడవుల్లో నీళ్ల ఏర్పాట్లు సరిగ్గా ఉండవు. నీటి జాడను వెతుక్కుంటూ జంతువులు బైటకు వస్తాయి.ఈ క్రమంలో మనుషులు కన్పిస్తే, అవి దాడులు చేస్తుంటాయి. కొన్ని జంతువులు ఎండ ప్రభావం వల్ల ఎంతో కోపంతో ఉండాయి. ఇప్పుడు మంటల ప్రభావంతో జంతువులు అడవుల నుంచి బైటకు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు, ఫారెస్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో మంటల వార్తతెలయడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter