Road Accident at kadapa-Four smugglers deid: ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లోని కడప (kadapa ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడప ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో (Road Accident) నలుగురు మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. టిప్పర్‌ను రెండు కార్లు ఢీకోనడంతో మంటలు చెలరేగాయి. దీంతో సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవ దహనం కాగా (Four red sandalwood smugglers burnt alive) ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కడప రిమ్స్ (RIMS) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎర్రచెందనం తరలిస్తుండగా.. టిప్పర్‌ను అధిగమించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొంటున్నారు. Also read: India: పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలను ఖాళీ చేయాలి: భారత్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిల్లాలోని తాడిపత్రి రహదారిపై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో ఈ ప్రమాదం సంభవిచింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో సుమో వాహనం మరో కారును అధిగమిస్తున్న క్రమంలో టిప్పర్‌ను ఢీకొట్టగా.. వెనుకనున్న కారు కూడా వీటిని ఢికొంది. అయితే సుమో నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంకును ఢికొట్టడంతో మంటలు చెలరేగి టిప్పర్‌తోపాటు రెండు కార్లు దగ్ధమయ్యాయి. దీంతో సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు వాహనంలోనే సజీవదహనమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also read: Pawan Kalyan Movie Shooting: రంగంలోకి దిగిన వకీల్ సాబ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe