Good News for Teachers: ఏపీలో టీచర్లకు శుభవార్త. త్వరలో బదిలీలు జరగనున్నాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు చేపడుతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలాకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ( Ap government ) శుభవార్త విన్పించింది. త్వరలో టీచర్ల బదిలీ ప్రక్రియను చేపడుతున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap minister adimulapu suresh ) ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను వెబ్ కౌన్సిలింగ్ ( Web Counselling ) విధానంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే  వివిధ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడామన్నారు. వెబ్ కౌన్సిలింగ్‌కు ఏవిధంగా వెసులుబాటు ఇవ్వాలనే దానిపై  ఒక డెమోను యూట్యూబ్ చానెల్లో అందుబాటులో ఉంచామన్నారు.  ఉపాధ్యాయులు ఈ వీడియో సహాయంతో వివరాలు తెలుసుకుని.. వెబ్ కౌన్సిలింగ్‌కు అప్షన్స్ ఇవ్వాలని మంత్రి సురేష్ విజ్ణప్తి చేశారు.


నవంబర్ 28 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ ( Teachers transfer ) కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామన్నారు. నవంబరు 30 నుండి ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశామని..డిసెంబర్ 3 నుండి 7 వరకూ అభ్యంతరాలుంటే డిఇఓలకు చెప్పాలన్నారు.  ఆ తరువాత డిసెంబర్  8 నుండి 10 లోగా తుది జాబితాను సిద్ధం చేయాల్సిందిగా డిఇఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డిసెంబర్ 16 నుంచి  21 వరకూ ఉపాధ్యాయుల బదిలీల తుది కేటాయింపు ఉంటుందన్నారు. 


20 శాతం హెఆచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-1 గా, 14.5శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-2 గా, 12శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-3 గా, 12 శాతం కంటే తక్కువ హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతాలను కేటగిరీ-4 గా విభజించి బదిలీల ప్రక్రియను చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు లక్షా 72 వేల వరకూ మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు ఉండగా వాటిలో 15 వేల పోస్టులను బ్లాక్ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధంగా బ్లాకు చేసిన పోస్టులను బదిలీల ప్రక్రియ పూర్తయ్యాక మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్ ప్రక్రియలో భర్తీ చేస్తామన్నారు. Also read: Eluru Mystery Disease: ఏలూరు తాగునీటిపై ఢిల్లీ ఎయిమ్స్ నివేదికలో ఏముందో తెలుసా…