Jayadev Galla Resigns: ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ ఎంపీ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాటు గుంటూరు ఎంపీగా ఆంధ్ర ప్రదేశ్‌ కోసం అనేక రకాలుగా సేవలు చేసినట్లు ఆయన తెలిపారు. 2024 ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను టార్గెట్ గా చేసుకున్నాయని గల్లా జయదేవ్ అన్నారు. తాను రాజకీయాలలో వచ్చేటప్పుడు పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయన్నారు. అప్పుడు తాను.. ఏదైతే బలం అని అనుకున్నానో.. ప్రస్తుతం అది బలహీనంగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కల్గుతున్న ఇబ్బందులతో  తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేక పార్లమెంట్ లో మౌనంగా ఉండాల్సి వస్తుందన్నారు.


ప్రతి బడ్జెట్ సమావేశంలో కూడా గట్టిగా మాట్లాడానని చెప్పారు. తనను రెండు సార్లు ఈడీ విచారించిందన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇలా చేశాయన్నారు. ఈడీ, సీబీఐలు ఇప్పటికి నా ఫోన్ లు ట్యాబ్ చేస్తున్నాయని గల్లా అన్నారు. కొన్నిసార్లు నా బిజినెస్ ల వల్ల కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని అన్నరు.


తన తండ్రి రెండెళ్ల క్రితం చైర్మన్ గా రిటైర్ అయ్యారని తెలిపారు. ఇక ఈ బాధ్యత నేను స్వీకరించాలని కూడా తెలిపారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ, బిజినెస్ లు చూసుకొంటున్నట్లు గల్లా తెలిపారు. భవిష్యత్ లో మరో మారు అవకాశం వస్తే రాజకీయాల్లోకి వస్తానని కూడా గల్లా జయదేవ్ మీడియా సమావేశంలో అన్నారు. 


Read Also: Bihar Politics: హీటెక్కిన బిహార్ రాజకీయాలు.. సీఎం పదవికి రాజీనామా సమర్పించిన నితీష్ కుమార్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook