Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు తమిళనాడుతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో(Bay of Bengal) కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో దాదాపు 75 శాతం చెరువులు నిండిపోయాయి. చిత్తూరు, తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చిపడుతుండటంతో దిగువకు నీరు వదులుతున్నారు. అటు తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నిండటంతో నీటికి దిగువకు విడిచిపెట్టారు. ఆకాశగంగ, కుమారధార ప్రాజెక్టులు నిండిపోయాయి. 


ఇక నెల్లూరులో కూడా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో  జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రవాణా స్థంభించిపోయుంది. ఇక సముద్రతీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని తిరిగి రావల్సిందిగా ఇప్పటికే సూచనలు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లాలో కూడా తీరం  వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాబోయే రోజుల్లో వర్షాలు విపరీతంగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD)అంచనా వేసింది. ప్రధానంగా తమిళనాడు, కేరళ, మహే, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తాలో నవంబర్ 10, 11 తేదీల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Also read: Chennai floods: చెన్నైని ముంచెత్తుతున్న వరద నీరు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఎంకే స్టాలిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook