విశాఖ విషాదం: నిపుణుల రిపోర్టులో షాకింగ్ నిజాలు
సాగరనగరం విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బాధితులు జీవితకాలం ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని నివేదిక సూచిస్తుంది.
విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సీఎస్ఐఆర్- ఎన్ఈఈఐఆర్ (CSIR-NEERI) నిపుణులు గ్యాస్ లీకేజీ ప్రమాదం ప్రభావం బాధితులపై దీర్ఘకాలం ఉంటుందని స్పష్టం చేశారు. వారి ఆరోగ్యంపై కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని, లేని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సూచించింది. కరోనా ఎఫెక్ట్: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు
CSIR-NEERI నిపుణుల నివేదికపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీకేజీ బాధితుల ఆరోగ్యంపై వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుందన్నారు. బాధితులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ బాధితులకు భవిష్యత్తులో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా, జీవితకాలంలో వారికి ఏ వైద్య చికిత్స అవసరమైనా ఉచితంగా అందించనున్నట్లు స్పష్టం చేశారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!