Vijayawada Landslide: ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు
Indrakeeladri Landslide | తీవ్ర వాయుపీడన ప్రభావం కారణంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి.
విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడలో అమ్మవారి సన్నిధిలో కొండచరియలు విరిగిపడ్డాయి. తీవ్ర వాయుపీడన ప్రభావం కారణంగా నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడలో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. సరిగ్గా ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుపీడనం కారణంగా ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిలో బండరాళ్లు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని బండరాళ్లను తొలగింపు చర్యలు చేపట్టాయి. ఈ కారణంగా ఘాట్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు.
కాగా, వర్షాల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ చరియలు విరిగిపడ్డ మార్గంలోనే వీవీఐపీలు, దుర్గమ్మ ఆలయ అధికారుల వాహనాలు ప్రయాణిస్తాయి. గతంలో చిన్న చిన్న బండరాళ్లు పడ్డ సందర్భాలున్నాయి. భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో తాజాగా మరోసారి ఇంద్రకీలాద్రిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
- Also Read : AP కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe