YCP On Tirumala Laddu Issue: ఏపీలో ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను ఈ లడ్డు వ్యవహారం ఏ మలుపు తిప్పుతుందో అని  ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకీ తిరుమల లడ్డు రూపంలో పెద్ద రాజకీయ సంక్షోభం వచ్చి పడింది. దీనిని నుంచి బయటపడటానికి వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో కావడంతో ఏమాత్రం పొరపాటున జరిగినా రాజకీయంగా కోలుకోని దెబ్బ తప్పదు అని వైసీపీ ఆందోళన చెందుతుంది. తిరుమల లడ్డు విషయంలో వైసీపీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దీనిని నుంచి  బయటపడేందుకు అన్ని రకాల దారులను వెతుక్కుంటుంది. అంతే కాదు ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీపై పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర దాగుందని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకీ వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అసలు ఎవరూ ఊహించని రీతిలో కేవలం 11 సీట్లకే పరిమితమై వైసీపీకీ పెద్ద షాక్ తగిలింది. ఓటమి తర్వాత నుంచి వైసీపీకీ వరుసగా రాజకీయంగా వరుస సమస్యలు వస్తూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వైసీపీ శ్రేణులపై దాడులు జరిగాయి. ఒక దశలో అసలు వైసీపీ నేతలు బయటకు  వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇది  ఇలా ఉంటుండగానే పార్టీకీ కొందరు కీలక నేతలు రాజీనామా చేసి టీడీపీలోకి వెళితే మరి కొందరు జనసేనలోకి వెళ్లారు. పార్టీ మారిన వాళ్లలో అత్యధికులు వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా  ముద్రపడినవారే కావడం విశేషం. దీంతో పార్టీ క్యాడర్ ఆత్మ రక్షణలో పడింది. ఇదే సమయంలో తిరుమల లడ్డూ రూపంలో వైసీపీకీ పెను సవాల్ వచ్చి పడింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారని అది జగన్ హయాంలోనే ఈ మహా ఘోరం జరిగింది అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించబడం పెద్ద సంచలనంగా మారింది.


ఈ ప్రకటన కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.  జగన్ హయాంలో ఇంత ఘోరం జరిగిందా అన్న చర్చ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగింది. ఒక రకంగా జగన్ పై హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉంది. జగన్ ఇంత పెద్ద ఘోరానికి పాల్పడ్డారా అన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఇది ఇప్పుడు వైసీపీకీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది. ఇది రాజకీయంగా వైసీపీకీ పెద్ద దెబ్బతగులుతుందా అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుంది.ప్రస్తుతం వైసీపీ వస్తున్న విమర్శలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అదే సమయంలో వైసీపీ ఎంత  గొంతు చించుకున్నా.. అది అరణ్య రోదనంగానే మారుతుంది తప్పా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుందని పార్టీ భావిస్తుంది. 


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక ఓ పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. పార్టీ పెద్దలు, సీనియర్ నేతల మధ్య ఈ లడ్డు వివాదంపై రకరకాలు చర్చలు జరుగుతున్నాయి. అసలు ప్రస్తుత పరిస్థితికి కారణాలు ఇవే అయి ఉండవచ్చని పార్టీ నేతల మధ్య ఆసక్తికర జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పాలన ముగిసి 100 రోజులు అవుతుంది . ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలం అయ్యిందని అందుకే అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని పార్టీ చాలా సాధారంగా జరుగుతున్న టాక్. ఇది కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది.


 ఐతే మరొక ఆసక్తికర చర్చ పార్టీ పెద్దల మధ్య జరుగుతుంది. దీని వెనుక బీజేపీ హస్తం ఏదైనా ఉందా అన్న సందేహాలు ఆ పార్టీ పెద్దల్లో కలుగుతున్నాయట. వారికి అలా అనుమానం కలుగడానికి కొన్ని కారణాలు చూపుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకీ,వైసీపీకీ గ్యాప్ పెరిగింది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేశారు. స్పీకర్ ఎన్నికకు మద్దతు కూడా ప్రకటించారు. అయితే ఎందుకో ఏమో కానీ బీజేపీ మాత్రం కొంత జగన్ ను రాజకీయంగా దూరం పెట్టినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పరిస్థితులు కూడా అలా తయారయ్యాయి.ప్రధానీ అపాయింట్ మెంట్ కోసం జగన్ ఎంత ప్రయత్నించినా దొరకకపోవడం..జగన్ ను తీవ్ర ఆలోచనలో పడేసింది.


మరో పక్క ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం జగన్ ను రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా పథకాలు రచిస్తుంది. ఇలాంటి సమయంలో జగన్ కు మోదీ నుంచి కనీస సహకారం దొరకలేదట. దీంతో జగన్ బీజేపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి జగన్ ను మచ్చిక చేసుకునే పనిలో పడిందట. జగన్ కూడా కాంగ్రెస్  కూటమి వైపు వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.


అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన సన్నిహితులతో బెంగుళూరు వేదికగా పలు సార్లు చర్చలు జరిపారని టాక్ నడిచింది. జగన్ ఇక కాంగ్రెస్ వైపు వెళ్లడం ఖాయం అని భావించిన బీజేపీకీ లడ్డు రూపంలో ఒక అవకాశం దొరికిందట. అందుకే  బీజేపీ  ఇదంతా చేసి ఉంటుందని పార్టీలో పెద్దలు భావిస్తున్నారట.జగన్ ను కాంగ్రెస్ కు దగ్గర కాకుండా రాజకీయంగా కంట్రోల్ చేయడానికి ఇదే ఒక్కటే మార్గం అని బీజేపీ భావించి ఇలా చేసి ఉంటుందా అని తాడేపల్లి క్యాంపులో చర్చ జరుగుతుందంట. ఐతే ఈ సంక్షోభం నుంచి  బయటపడటానికి ఏం చేయాలో అన్న దాంట్లో జగన్ బిజీబిజీగా ఉన్నారట. 


అసలే ఘోర ఓటమితో తీవ్ర నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్ కు ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం పార్టీనీ ఎటువైపు తీసుకెళుతుందో అన్న ఆందోళనలో పార్టీ పెద్దలు ఉన్నారట. వీలైనంత త్వరలో ఈ సమస్య నుంచి బయటపడాలని వైసీపీ పెద్దల నుంచి క్యాడర్ దాకా కోరుకుంటుందంట. 


Also Read: NTR Emotional: పోలీస్‌ లాఠీచార్జ్‌పై ఎన్టీఆర్‌ భావోద్వేగం.. ఫ్యాన్స్ కాలరేగరేసేలా చేస్తా


Also Read: Devara Pre Release: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. దేవర ప్రి రిలీజ్‌ వేడుక రద్దు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.