NTR Emotional Video On Fans: ఊహించని రీతిలో వచ్చిన అభిమానులను నిలవరించడంలో పోలీస్, భద్రతా సిబ్బంది విఫలమైన వేళ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్ విరగడంపై జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈవెంట్ రద్దు.. తర్వాత జరిగిన పరిణామాలపై ఎన్టీఆర్ స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు కీలకమైన విషయాన్ని చెప్పారు.
Also Read: Devara Pre Release: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. దేవర ప్రి రిలీజ్ వేడుక రద్దు
'అభిమాన సోదరులకు నమస్కారం. ఈరోజు దేవర ఈవెంట్ జరగకపోవడం.. రద్దవడం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని.. దేవర సినిమా గురించి.. దేవర సినిమాకు పడిన కష్టం గురించి వివరించడం మీ అందరికీ వివరిద్దామని చాలా ఆసక్తిగా ఉన్నా. కానీ భద్రతా కారణాల వల్ల ఈవెంట్ రద్దవుతుంది. మళ్లీ చెబుతున్నాను మీతోపాటు నేను బాధపడుతున్నా. మీకంటే నా బాధ చాలా పెద్దది. ఎక్కువ కూడా. ఇలా జరగడం నిర్మాతలు, నిర్వాహకులను తప్పు పట్టడం సరికాదు. మీరు కురిపించే ఈ ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటా. ఈరోజు కలవకపోయినా సెప్టెంబర్ 27వ తేదీన మనందరం కలవబోతున్నా. దేవర సినిమాను మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ కాలరేగేసేలా తిరగడం చేయడమే నా బాధ్యత. దాంతో వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను. సెప్టెంబర్ 27వ తేదీన అదే జరగబోతున్నది. దేవర సినిమాకు.. నాకు మీ ఆశీర్వాదం ఎంతో అవసరం' అని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also Read: Samantha: వైరల్ గా మారుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్.. ఈ మార్క్స్ చూశారా..?
ఏం జరిగింది?
కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ముందస్తు విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొద్ది సంఖ్యలో మాత్రమే అభిమానులను ఆహ్వానించారు. అయితే ఊహించని స్థాయిలో అభిమానులు రావడంతో హోటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. వేలాదిగా ఆడిటోరియం లోపలకు వచ్చేందుకు ఎన్టీఆర్ అభిమానులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నోవాటెల్ హోటల్ లోపల అద్దాలు ధ్వంసమయ్యారు. దాదాపు 20 వేల మందికి పైగా అభిమానులు తరలిరావడంతో భద్రతా సిబ్బంది చేతులెత్తేసింది. అభిమానుల తాకిడిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అభిమానులు గాయపడ్డారు. ఈ కారణంగా ఈవెంట్ కూడా రద్దయ్యింది.
ద్విపాత్రాభినయంతో ఎన్టీఆర్, తన అందాలతో జాన్వీ కపూర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ట్రైలర్, టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో సినిమాకు ధరలు పెంచగా.. తెలంగాణలో కూడా పెంచే అవకాశం ఉంది.
We regret being in this situation but are forever grateful to our beloved Man of Masses NTR’s fans. 🙏🏻🙏🏻
The biggest celebration awaits. See you in theatres on Sept 27th.#Devara #DevaraOnSep27th pic.twitter.com/oSXa2ga6Za
— Devara (@DevaraMovie) September 22, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.