ఏపీ ప్రభుత్వంపై పవన్ మండిపాటు.. వరద బాధితులకు సహాయంపై అసంతృప్తి!
Pawan Kalyan: వరద బాధితులకు తామున్నామనే భావన కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే.. ప్రభుత్వం ఇసుక అమ్ముతామని ప్రకటలు ఇస్తుండటంపై మండిపడ్డారు.
Pawan Kalyan on AP Govt: ఏపీ ప్రభుత్వం తీరుపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
"వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే, ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం - పంట నష్టం, పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం 'ఇసుక అమ్ముతాం' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ??" అంటూ (Pawan fire on AP Govrt) ధ్వజమెత్తారు.
సాయం అందించాల్సిన తరుణమిది..
కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరదల నేపథ్యంలో.. జనసేన నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు పవన్ కల్యాణ్. వరదల కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలు చూస్తుంటే.. హృదయం కలచి వేస్తోందని పేర్కొన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉంటే.. అండగా నిలిచి సహాయం చేయాల్సిన తరుణమిదన్నారు పవన్ కల్యాణ్. కష్టకాలంలో ప్రభుత్వం మనకోసం నిలబడిందనే భావన కల్పించాలన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ భావన కల్పించడంలో కూడా విఫలమవుతోందని విమర్శించారు (Pawan Kalyan on AP Floods) పవన్ కల్యాణ్.
జనసేన తరఫున రెండు విడతలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేపట్టనున్నట్లు తెలిపారు జనసేనాని. తొలి విడతలో పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ పర్యటించిన తర్వాత.. క్షేత్ర స్థాయిలో తాను పర్యటిస్తానని పవన్ కల్యాణ్ వివరించారు.
Also read: అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
Also read: ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. అనేక రైళ్లు దారి మళ్లింపు
వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొనాలి..
ప్రజల డబ్బుతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించి.. ఇప్పుడు ఆ వ్యవస్థను కేవలం ఎన్నికల కోసమే వాడుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఏ బాధ్యతల లేకపోయినా.. జనసైనికులు ముందుకొచ్చి సహాయం చేస్తుంటే.. వాలంటీర్లు ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు.
Also read: చంద్రబాబు ఏడవడం చూసి తానూ ఏడ్చేసిన భువనేశ్వరి... అసెంబ్లీ ఘటనపై ఆమె రియాక్షన్ ఇదే...
Also read: కడపలో తిరుమల ఎక్స్‌ప్రెస్ నిలిపివేత.. అధికారులతో ప్రయాణికుల గొడవ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook