/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఇటీవలి పరిణామాలపై తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది. దిగజారిన మనుషులు ఏవో మాట్లాడుతారు... అన్నీ మనసులో పెట్టుకోవద్దని భర్త చంద్రబాబుతో భువనేశ్వరి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ప్రెస్ మీట్‌ను (Chandrababu Naidu) టీవీలో చూసిన భువనేశ్వరి.. ఆయన వెక్కి వెక్కి ఏడవడం తట్టుకోలేక తాను కూడా ఏడ్చినట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ తర్వాత ఇంటికెళ్లిన చంద్రబాబు, లోకేష్‌లను చూసి మరోసారి ఆమె కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది. కానీ ఆ వెంటనే తేరుకున్న ఆమె... జరిగినదాన్ని తలుచుకుని బాధపడవద్దని చంద్రబాబును అనునయించినట్లు సమాచారం.

'రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్న(ఎన్టీఆర్) గారు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయన పట్ల నీచంగా మాట్లాడేవారు. బాధపెట్టడానికే అలా మాట్లాడుతారు. మనసుకు బాధ కలిగినా వాటిని మనం పట్టించుకోవద్దు. మిమ్మల్ని కూడా బాధపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవద్దు.' అని చంద్రబాబుతో భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఏడ్చిన ఘటనపై ఇప్పటికైతే భువనేశ్వరి నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన లేదు. ఆమె చంద్రబాబుతో చేసిన వ్యాఖ్యలు కుటుంబ సన్నిహిత వర్గాల ద్వారా బయటకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం (నవంబర్ 19) జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలత చెందేలా చేశాయని చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి బోరున విలపించిన సంగతి తెలిసిందే. సభలో తన భార్య భువనేశ్వరి పేరును ప్రస్తావించి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో (AP Politics) ఎంతోమంది మహామహులతో కలిసి పనిచేశానని... కానీ ఇంత ఘోరమైన అవమానాలు ఎప్పుడూ ఎదుర్కొలేదని వాపోయారు. అంతకుముందు, సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన చంద్రబాబు... మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేశారు.

Also Read: చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ కాల్... అసెంబ్లీ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సూపర్ స్టార్...

చంద్రబాబు, భువనేశ్వరిలకు నందమూరి కుటుంబం అండగా నిలబడింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ సహా ఆ కుటుంబానికి చెందిన పలువురు అసెంబ్లీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, భువనేశ్వరిలకు సంఘీభావం ప్రకటించారు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మరోవైపు, వైసీపీ నేతలు మాత్రం అసలు సభలో భువనేశ్వరి ప్రస్తావనే రాలేదని చెబుతున్నారు. వైసీపీ నేతలు అనని మాటలను అన్నట్లుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Section: 
English Title: 
nara bhuvaneshwari first reaction over chandrababu breaks down into tears
News Source: 
Home Title: 

చంద్రబాబు ఏడవడం చూసి తానూ ఏడ్చేసిన భువనేశ్వరి... అసెంబ్లీ ఘటనపై ఆమె రియాక్షన్ ఇదే..

 చంద్రబాబు ఏడవడం చూసి తానూ ఏడ్చేసిన భువనేశ్వరి... అసెంబ్లీ ఘటనపై ఆమె రియాక్షన్ ఇదే...
Caption: 
Image source : Facebook
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నారా భువనేశ్వరి రియాక్షన్
దిగజారిన మనుషులంటూ వైసీపీ నేతలపై పరోక్ష విమర్శలు
చంద్రబాబు ప్రెస్ మీట్‌ను టీవీలో చూసి ఏడ్చేసిన భువనేశ్వరి

Mobile Title: 
చంద్రబాబు ఏడవడం చూసి తానూ ఏడ్చేసిన భువనేశ్వరి... అసెంబ్లీ ఘటనపై ఆమె రియాక్షన్ ఇదే..
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, November 21, 2021 - 14:49
Request Count: 
229
Is Breaking News: 
No