Fly Ash Dispute: ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్‌ అనంత వెంకట్రామి రెడ్డి వివాదం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. ఫ్లైయాష్‌ విషయంలో ఒకరికొరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. సీఎం చంద్రబాబు కల్పించుకుంటారని ఆదేశాలు వచ్చినా కూడా ఆ నాయకుల మధ్య వివాదం సద్దుమణగలేదు. మరోసారి అనంత వెంకట్రామి రెడ్డిపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి రెచ్చిపోయారు. తనకు కొట్టడం కూడా తెలుసని హెచ్చరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు వరద ముప్పు.. ఫెంగల్‌ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష


అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్‌ నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫ్లైయాష్ అంశంలో తనను విమర్శించిన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి బూతు పురాణంతో రెచ్చిపోయారు. 'ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో నాకేం సంబంధం?' అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కోపం.. తాపం.. రోషం ఉన్నా పక్కన పెట్టారు. నేను చంద్రబాబు అంత మంచివాడిని కాదు. నాకు కోపం, తాపం, రోషం ఉంది. కొట్టడం కూడా తెలుసు' అంటూ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.


Also Read: YS Jagan: 'కష్టాలు, నష్టాలు ఉంటాయి.. ఆ సమయంలో నా జైలు జీవితం గుర్తుచేసుకోండి'


వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని జేసీ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చినా కూడా టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని.. ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇక తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే వారికి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. విమర్శించే వారిని 'ఇంటికొచ్చి చెప్పుతో కొడతా' అంటూ హెచ్చరించారు.


తాడిపత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలను అనంత వెంకట్రామిరెడ్డి వెనకేసుకొస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా' అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి హెచ్చరించారు. అనంత వెంకటరామిరెడ్డిని ఊరు విడిపిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు. అనంత వెంకటరామిరెడ్డి ఇంటి పక్కన ఉన్న ఐటీఐ కళాశాల భూమిని కబ్జా చేసి గేటు పెట్టాడని తీవ్ర ఆరోపణలు చేశారు. డిసెంబర్ 4 లేదా 5వ తేదీన అనంత వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి గేట్లు పగలగొడతా అంటూ హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter