KA Paul Comments: వేయి కోట్లకు జనసేనను టీడీపీకు తాకట్టు పెట్టిన పవన్, కేఏ పాల్ తీవ్ర ఆరోపణలు
KA Paul Comments: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని ఏకంగా 1000 కోట్లకు అమ్మేశారన్నారు. ఆ వివరాలు మీ కోసం..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలయిక నేపధ్యంలో కేఏ పాల్ మరోసారి విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తనదైన రీతిలో ఆరోపణలు చేశారు. అప్పుడు చిరంజీవి..ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీల్ని అమ్మేశారన్నారు.
ఎప్పుడూ ఏదో ఒక మాటలతో సంచలనం కల్గించే కేఏ పాల్ ఈసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. నాడు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి 1500 కోట్లకు కాంగ్రెస్ పార్టీకు అమ్మేస్తే..ఇప్పుుడు పవన్ కళ్యాణ్ 1000 కోట్లకు జనసేనను టీడీపీకు తాకట్టు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ పక్కనుండే నాదెండ్ల మనోహర్ ఈ డీల్ సెట్ చేశారన్నారు. ఇది తెలుసుకునే సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ, తోట చంద్రశేఖర్‌లు పార్టీకు దూరమయ్యారని కేఏ పాల్ వివరించారు. కాపు సామాజికవర్గం పేరు చెప్పి నాడు ప్రజారాజ్యం పార్టీ..ఇప్పుడు జనసేన పార్టీలు అమ్ముడయ్యాయన్నారు.
నారా లోకేశ్‌ను ఏపీ ముఖ్యమంత్రిగా చేసేందుకు నాదెండ్ల మనోహర్-చంద్రబాబు కలిసి ప్లాన్ చేశారని..1000 కోట్లకు డీల్ కుదిరిందన్నారు కేఏ పాల్. పవన్ కళ్యాణ్‌కు సంక్రాంతి కానుక అందిందన్నారు.
మరోవైపు రెండు పార్టీల సీట్ల పంపకాలు కూడా కొలిక్కివచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకు 22 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చేలా రెండు పార్టీల మధ్య చర్చ జరిగిందనే వార్తలు విన్పిస్తున్నాయి. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు తీసుకోనుంది. అయితే జనసేన మాత్రం 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
Also read: Pawan Kalyan Comments: బాబును అందుకే కలిశా.. అసలు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook